యువత తప్పుదోవ పట్టకుండా చూసే భాద్యత తల్లిదండ్రులతో పాటు సమాజం మీద కూడా ఉందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ పేర్కొన్నారు. తప్పుడు మార్గంలో వెళ్లాలనే ఆలోచనను ఆదిలోనే తుంచేస్తే వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్లము అవుతామన్నారు.
పాత బస్తీ పురానిహవేలీలో స్థానిక కార్పొరేటర్లతో సమావేశం అయిన సీపీ.. మహిళల భద్రతతో పాటు పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ల నుంచి కూడా మంచి సూచనలు వచ్చాయని పూర్తి స్థాయిలో నేర రహిత నగరంగా మార్చడానికి కృషి చేస్తున్నట్లు అంజనీ కుమార్ తెలిపారు. డయల్ 100 మరింత సమర్థవంతంగా తీర్చి దిద్దుతున్నట్లు పేర్కొన్నారు.
ఇవీ చూడండి: విద్యార్థినులకు 3నెలల పాటు మార్షల్ ఆర్ట్స్ శిక్షణ