ఆర్టీసీ కార్మికులు తిరిగి విధుల్లోకి చేరడానికి ప్రభుత్వం రేపటి వరకు ఇచ్చిన గడువు దృష్ట్యా... ఉద్యోగుల భద్రత తమ బాధ్యత అని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ స్పష్టం చేశారు. విధుల్లోకి చేరేందుకు వచ్చే వారిపై భౌతిక దాడులకు పాల్పడినా... వారికి ఆటంకం కలిగించినా కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు, తిరిగి విధులలో చేరే క్రమంలో పోలీసులు పూర్తిస్థాయి భద్రత కల్పిస్తామన్నారు. విధులలో చేరాలనుకుంటే నిర్భయంగా చేరవచ్చని, ఎవరైనా ఇబ్బందులు పెట్టినా, భయపెట్టినా వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అడ్డగించినా, బెదిరింపులకు పాల్పడినా వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో నేరుగా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ప్రతి డిపో వద్ద ఇన్స్పెక్టర్ స్థాయి అధికారితో భద్రత ఏర్పాటు చేశామని సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు సైతం వెల్లడించారు.
ఇవీ చూడండి: 'విధులకు హాజరయ్యే ఆర్టీసీ ఉద్యోగుల భద్రత మాదే'