Union of Journalists Diary was inaugurated program: వేగంగా వ్యాపి చెందుతున్నా సామాజిక మాధ్యమాలపై మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన.. అనధికారికంగా కొనసాగుతున్న సోషల్ మీడియాలను నిర్లక్ష్యం చేయవద్దని ఆయన సూచించారు.
ప్రధాన మీడియా కంటే వివిధ ఛానల్స్ పేర్లతో పుట్టుకొస్తున్న సామాజిక మాధ్యమాల ప్రభావం ప్రస్తుతం తీవ్రంగా ఉందని ఆయన అభిప్రాయ పడ్డారు. మీడియాలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్న ఆయన.. ప్రస్తుతం ఉన్న చట్టాల పరిధిలోకి సోషల్ మీడియాను తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేయాలని.. వారికి అవగాహన కల్పించే విషయంపై యూనియన్లు దృష్టి సారించాలని కోరారు. అనంతరం మీడియా డైరీని సీనియర్ పాత్రికేయులు శ్రీనివాస్ రెడ్డి, అమర్లతో కలిసి ఆవిష్కరించారు.
"ప్రధాన మీడియా కంటే వివిధ ఛానల్స్ పేరుతో పుట్టుకొస్తున్న సామాజిక మాధ్యమాల్లో ప్రభావం తీవ్రంగా ఉంది. వేగంగా వ్యాపి చెందుతున్నా సామాజిక మాధ్యమాలపై మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసి.. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం. మీడియా వల్లే పోలీసులకు ప్రాచుర్యం లభిస్తోంది. అదే సమయంలో వృత్తిపరంగా జరిగే తప్పులను తెలుసుకొని మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించేందుకు మీడియా ఎంతో ఉపయోగపడుతోంది. తీవ్ర ఒత్తిడితో విధులు నిర్వహిస్తున్న పాత్రికేయులకు మా వంతు సహకారం ఉంటుంది."- సీవీ ఆనంద్, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్
ఇవీ చదవండి:
- పరీక్షా పే చర్చలో ప్రధాని మోదీని ప్రశ్నించిన రాష్ట్ర విద్యార్థిని అక్షర
- 'AM 2 PM' పేరిట ఎక్స్ప్రెస్ పార్శిల్ సర్వీసును ప్రారంభించిన TSRTC
- ఒంటరిగా నిద్రిస్తున్న చెల్లిపై అక్క లైంగిక వేధింపులు.. తట్టుకోలేక పోలీస్ స్టేషన్కెళ్లి..
- 'పోలీసులు ఎక్కడా కనిపించట్లేదు.. అందుకే జోడో యాత్ర రద్దు!'