ETV Bharat / state

మధ్యలో ఆపేస్తే కోర్సు మొత్తం ఫీజు కట్టాలా..?

విద్యార్థుల ధ్రువపత్రాలు, కోర్సు పూర్తయ్యే వరకు కొన్ని కళాశాలలు అట్టిపెట్టుకొంటున్న నేపథ్యంలో ఈ విషయమై హైదరాబాద్‌ జిల్లా వినియోగదారుల కమిషన్‌ చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఓ విద్యార్థిని కమిషన్‌ను ఆశ్రయించడంతో, ఆ విద్యార్థినికి రూ.15 వేల జరిమానా చెల్లించాలని హిమాయత్‌నగర్‌లోని మదీనా మహిళా డిగ్రీ కళాశాలను ఆదేశించింది.

author img

By

Published : Jan 21, 2021, 8:32 AM IST

verdict on college fee
మధ్యలో ఆపేస్తే కోర్సు మొత్తం ఫీజు కట్టాలా..?

నారాయణగూడకు చెందిన మద్ది జాహ్నవి 2017-18 విద్యా సంవత్సరంలో మదీనా మహిళా డిగ్రీ కళాశాలలో బీఎస్సీ(ఏఎన్‌బీసీ)లో చేరింది. రెండో సంవత్సరానికి అర్హత సాధించిన సమయంలోనే బీపీటీ కోర్సుకు ఎంపికైంది. ఆ కోర్సులో చేరేందుకు తన అసలు ధ్రువపత్రాలు ఇవ్వాలని కళాశాల సిబ్బందిని కోరింది. బీఎస్సీ రెండో సంవత్సరం మొత్తం ఫీజు చెల్లిస్తేనే ఇస్తామని వారు చెప్పారు. దీంతో రూ.24,535 చెల్లించింది.

నిబంధనలకు విరుద్ధం కాదా..

ఈమేరకు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కేంద్రాన్ని ఆశ్రయించింది. చెల్లించిన ఫీజుకు కనీసం రశీదు ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొంది. యూజీసీ నిబంధనల ప్రకారమే ఫీజు వసూలు చేశామని మదీనా కళాశాల జిల్లా కమిషన్‌కు రాతపూర్వక వివరణ ఇచ్చింది. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ), అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ), వివిధ విశ్వవిద్యాలయాలు జారీ చేసిన నిబంధనలు పరిశీలించిన జిల్లా కమిషన్‌-2 అధ్యక్షుడు వక్కంటి నర్సింహారావు ఆ కళాశాల తీరుపై మండిపడ్డారు. కళాశాల పేర్కొన్న నిబంధనలు సెమిస్టర్‌ పద్ధతి, లేదా ప్రస్తుత సంవత్సరం చదువుతున్నవారికి వర్తిస్తాయన్నారు. అసలు ధ్రువపత్రాలు కళాశాలలు తీసుకోవడం యూజీసీ నిబంధనలకు విరుద్ధం కాదా అని ప్రశ్నించారు.

జాహ్నవి చెల్లించిన రూ.24,535తో పాటు పరిహారంగా రూ.10 వేలు, కేసు ఖర్చుల కింద మరో రూ.5 వేలు చెల్లించాలని కళాశాలను ఆదేశించారు.

ఇవీచూడండి: బైడెన్, కమలా.. సీక్రెట్​ కోడ్​ పేర్లు ఇవే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.