కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా రాష్ట్రంలో రవాణా స్తంభించిపోయింది. దీనితో హైదరాబాద్ బేగంపేటలో ఉంటున్న జయరాజ్ అనే వ్యక్తికి హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. అతన్ని ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్‌కి ఫోన్ చేసినప్పటికీ ఆలస్యం అవుతుండడం వల్ల బాధితుడి స్నేహితుడు డయల్ 100కి కాల్ చేశాడు. దీనితో పక్కనే ఉన్న బేగంపేట పోలీసులు వెంటనే స్పందించారు. అతన్ని పోలీసు వాహనంలోనే సురక్షితంగా కిమ్స్ ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు.
ఇదీ చూడండి: ఎలాంటి రెడ్ జోన్లు లేవు.. వదంతులు నమ్మొద్దు: ఈటల