ఈ ప్రదర్శన నాలుగు రోజుల పాటు జరుగుతుందని తెలిపారు. మణిపూర్, అస్సాం, మిజోరాం, సిక్కిం, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన దాదాపు 280 మంది కళాకారులు పాల్గొంటున్నారు. వారు తయారు చేసిన ఉత్పతులు అందుబాటులో ఉంచనున్నారు. ఈ ప్రదర్శనకు వచ్చే సందర్శకులకు ప్రవేశం ఉచితమని బుర్ర వెంకటేశం తెలిపారు.
వేడుకల్లో ప్రారంభోత్సవ నృత్యం అందరినీ ఆకట్టుకుంది. మిజోరాం, అరుణాచల్ రాష్ట్రాలకు చెందిన కళాకారులు కత్తులతో చేసిన జానపద నృత్యం, అస్సాం గిరిజన మహిళల శక్తి సామర్థ్యాలు వివరిస్తూ చేసిన నృత్యం సందర్శకులను అలరించాయి.