ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న వారి వయో పరిమితిని 58నుంచి 65ఏళ్లకు పెంచడంపై జూనియర్ డాక్టర్లు అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల ప్రాంగణాల్లో దీక్ష చేపట్టారు. ఈ విషయమై నిన్ననే నిరవధిక సమ్మెను ప్రకటించిన వైద్యులు... నేడు ఓపీ సేవలను బహిష్కరించారు. ప్రభుత్వం వయో పరిమితి పెంపు విషయంపై కచ్చితమైన కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను తక్షణం భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈటీవీ భారత్ ప్రతినిధి రమ్య అందిస్తారు.
ఇవీ చూడండి: లాఠీఛార్జ్‌లో ఎమ్మెల్యే రాజాసింగ్ తలకు గాయాలు