కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని ఆరో ప్యాకేజీ ఎత్తిపోతల్లో మొదటిపంపును రేపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ప్రారంభించనున్నారు. ఎల్లంపల్లి నుంచి నందిమేడారం పంపుహౌజుకు నీటి విడుదల ప్రక్రియ ఈరోజు సాయంత్రానికి పూర్తి కానుంది. ప్రయోగాత్మక నీటి విడుదలలో భాగంగా సర్జిపూల్‌ను పూర్తిస్థాయి నీటిమట్టానికి నింపుతున్నారు. ఎల్లంపల్లి హెడ్‌రెగ్యులేటర్ నుంచి ఇప్పటికే వెయ్యి క్యూసెక్కుల నీటిని ఇంజినీర్ ఇన్ చీఫ్ ఎన్. వెంకటేశ్వర్లు నందిమేడారం వైపు కాల్వలోకి విడుదల చేశారు.
రేపు మిడ్ మానేరువైపునకు విడుదల..
ఈరోజు సాయంత్రానికి ఈనీటితో ఎల్లంపల్లి జలాశయం పూర్తి నీటిసామర్థ్యం142.3 మీటర్ల స్థాయికి సర్జిపూల్ చేరుకుంటుందని ఇంజినీర్లు అంచనా వేస్తున్నారు. రేపు పంపుహౌజులోని ఏడు పంపుల్లో ఒకపంపు మోటారును ప్రయోగాత్మకంగా నడిపి నీటిని మిడ్ మానేరువైపునకు విడుదల చేస్తారు. ఆ తర్వాత మిగతా పంపుల వెట్రాన్ని కూడా అధికారులు పరీక్షించనున్నారు.
ఇవీ చూడండి: సింగరేణి ఓపెన్‌కాస్ట్ పనులు... తెచ్చాయి కష్టాలు