ETV Bharat / state

తాగడానికి డబ్బులివ్వలేదని.. భార్యను చంపిన భర్త! - తోటాడలో భార్యను హత్య చేసిన భర్త

మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని భార్యని హత్యచేసిన ఘటన ఏపీలోని విశాఖ జిల్లాలో జరిగింది. తోటాడ గ్రామానికి చెందిన వీరునాయుడు మద్యం కోసం డబ్బులివ్వమని భార్య సన్యాసమ్మతో తరుచూ గొడవకు దిగుతుండేవాడు. ఈ క్రమంలోనే గురువారం వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. భార్య సన్యాసమ్మపై వీరునాయుడు చేయిచేసుకోగా.. ఆమె స్పృహతప్పి పడిపోయింది. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

husband murder wife for not giving money in vishaka district
తాగడానికి డబ్బులివ్వలేదని.. భార్యను చంపిన భర్త!
author img

By

Published : Aug 22, 2020, 12:43 AM IST

మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదని భార్యని హత్య చేసిన సంఘటన విశాఖ జిల్లా అనకాపల్లిలోని తోటాడ గ్రామంలో జరిగింది. తోటాడ శివారు గ్రామంలో నివసిస్తున్న ఇల్లా సన్యాసమ్మ, భర్త వీరునాయుడు తరుచూ గొడవపడుతుండేవారు.

వీరు నాయుడు తరచూ మద్యం తాగడానికి డబ్బుల కోసం సన్యాసమ్మతో ఘర్షణకు దిగేవాడు. అలా గురువారం సాయంత్రం గొడవపడి... సన్యాసమ్మపై వీరుస్వామి చేయి చేసుకున్నాడు. దెబ్బ బలంగా తగలడం వల్ల ఆమె స్పృహతప్పి పడిపోయింది. గమనించిన కుటుంబసభ్యులు సన్యాసమ్మను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి కుమారుడు శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వీరునాయుడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:

'నా వంతు బాధ్యతగానే ఈ పని చేశాను'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.