ETV Bharat / state

Husband Killed Wife in Hyderabad Today : నాగోల్​లో దారుణం.. భార్యను కత్తితో పొడిచి హత్య.. ఆపై భవనం నుంచి దూకి భర్త ఆత్మహత్య - నాగోల్​లో భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త

Husband Killed Wife in Hyderabad Today : హైదరాబాద్​లో దారుణం జరిగింది. భార్యను కత్తితో పొడిచి చంపిన అనంతరం ఓ భవనంపై నుంచి దూకి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Husband Killed His Wife in Nagole
Husband Killed His Wife Before Suicide
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 17, 2023, 10:10 AM IST

Updated : Oct 17, 2023, 11:41 AM IST

Husband Killed Wife in Hyderabad Today : హైదరాబాద్​లోని నాగోల్​ పోలీస్​ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను కత్తితో పొడిచి చంపాడు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్​ నాగోల్​ పోలీస్​ స్టేషన్ పరిధిలోని సాయినగర్​లో రాజు, సంతోషి(35) దంపతులు జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి ఒక అమ్మాయి.. అబ్బాయి ఉన్నారు. వీరి స్వస్థలం మహబూబ్​ నగర్​లోని ఆమనగల్​ సమీపంలోని ఆకుతోటపల్లి. దంపతుల ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో.. ఇవాళ తన భార్యను రాజు దారుణంగా పొడిచి చంపేశాడు. అనంతరం సరూర్​ నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని తపోవన్​ కాలనీలో తన సోదరి ఇంటికి వెళ్లి.. భవనం మూడో అంతస్తు నుంచి దూకి బలవన్మరణం చేసుకున్నాడు.

husband killed his wife: భార్యను ముక్కలుగా నరికి.. నగ్నంగా మార్చేసి..!

Man Killed Wife At Nagole Today : స్థానికుల ద్వారా విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు కుటుంబ కలహాలే కారణమని ప్రాథమిక నిర్ధారణకు వచ్చామని పోలీసులు వెల్లడించారు. రాజు లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని తెలుసుకున్నారు. మరిన్ని విషయాలు విచారణ తరవాత చెబుతామని పోలీసులు తెలిపారు.

బ్యూటీపార్లర్​లో భార్యను చంపి.. మెడలో పూలదండలు వేసి..

భార్యపై అనుమానం.. సుత్తితో కొట్టి చంపిన భర్త.. ఆ తర్వాత ఏం జరిగిందటే!!

Last Updated : Oct 17, 2023, 11:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.