మంచిర్యాల జిల్లా కొత్త కొమ్ముగూడెంకు చెందిన సౌజన్య, లక్ష్మణ్ దంపతులు హైదరాబాద్ కూకట్ల్లిలోని ప్రగతి నగర్లో ఉంటున్నారు. వీరికి ఒక బాబు ఉన్నారు. లక్ష్మణ్ ఓ వివాహితతో గత కొద్ది రోజులుగా వివాహేతర సంబంధం సాగిస్తున్నాడు. ఇందుకు సంబంధించి సౌజన్య వద్ద ఫొటోలు ఉండడం వల్ల పెద్దల ముందు భర్తను నిలదీసింది. అవి గతంలో దిగిన ఫొటోలని లక్ష్మణ్ చెప్పాడు. కానీ లక్ష్మణ్ ప్రగతినగర్‌లో ఓ ఇంట్లో ఆ వివాహితతో కలిసి ఉంటున్నారని గమనించిన సౌజన్య ఆ ఇంట్లోకి వెళ్లి భర్తతోపాటు ఉన్న మహిళను రెడ్ హ్యాండ్‌గా పట్టుకుంది. ప్రియురాలికి గతంలో ఓ వ్యక్తితో పెళ్లి అయింది. బాబు కూడా ఉన్నాడు. ఆమె భర్తకు దూరంగా ఉంటోంది.
ఇదీ చూడండి: లోక్‌సభలో చర్చకు తలాక్ బిల్లు- నేడు ఆమోదం!