కరోనా మహమ్మారి నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ఠమైన నియమాలు అమలు చేయకపోవడం వల్లే కొవిడ్ విజృంభిస్తోందని యూటీఎఫ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ఆరోపించారు. కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చాలని కోరుతూ.. హైదరాబాద్ ముషీరాబాద్‌లోని సీఐటీయూ నగర కార్యాలయంలో కొవిడ్ వ్యాక్సిన్ చైతన్య వేదిక ప్రతినిధులు ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షా శిబిరాన్ని నర్సిరెడ్డి ప్రారంభించారు.
ప్రజలకు వ్యాక్సిన్‌ను అందించడంలో కూడా ఇరు ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఎమ్మెల్సీ అన్నారు. రెండో డోసు కోసం వేలాది మంది ఎదురు చూస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం విచారకరమని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: కొవిడ్‌తో కొడుకు.. ప్రమాదంలో తండ్రి మృతి