ETV Bharat / state

వంద శాతం మూడోసారి గెలుపు నాదే: సూర్యనారాయణ - గ్రేటర్​ హైదరాబాద్​ ఎన్నికల వార్తలు

కారు గుర్తుకే ఓటేస్తామని ప్రజలు చెబుతున్నారని.. జూబ్లీహిల్స్‌ తెరాస అభ్యర్థి కాజా సూర్యనారాయణ అన్నారు. తాను చేసిన అభివృద్ధే మూడోసారి కార్పొరేటర్​ను చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

jubilee hills trs candidate
వంద శాతం మూడోసారి గెలుపు నాదే: సూర్యనారాయణ
author img

By

Published : Nov 28, 2020, 9:37 AM IST

కార్పొరేటర్​గా గతంలో చేసిన అభివృద్ధి పనులే మళ్లీ తనను గెలిపిస్తాయని జూబ్లీహిల్స్‌ తెరాస అభ్యర్థి కాజా సూర్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. తన హయాంలో మంచినీరు, రహదారులు, విద్యుత్​ సమస్యలను పరిష్కరించినట్లు చెప్పారు.

సూర్య నారాయణకు మద్దతుగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్‌లోని ఎఫ్‌ఎన్‌సీసీలో సినీ ప్రముఖులతో సమావేశం ఏర్పాటుచేశారు. కేఎస్ ‌రామారావు, అశోక్‌కుమార్‌, అది శేషగిరిరావు సహా పలువురు దర్శక నిర్మాతలు, ఫిల్మ్​ క్లబ్‌ సభ్యులు పాల్గొన్నారు.

ప్రచారంలో స్థానికుల నుంచి మంచి స్పందన వస్తోందని.. కారు గుర్తుకే ఓటేస్తామని చెబుతున్నారని సూర్యనారాయణ ఆనందం వ్యక్తం చేశారు. గతంలోనూ ప్రజలకు అందుబాటులో ఉన్నానని.. మరోసారి అవకాశం ఇస్తే పెండింగ్​ సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.

వంద శాతం మూడోసారి గెలుపు నాదే: సూర్యనారాయణ

ఇవీచూడండి: బడ్జెట్‌ బెత్తెడు... భారం బండెడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.