పెద్ద నాయకులను, ఆధ్యాత్మిక వేత్తలను ప్రపంచం మర్చిపోయినా సేవచేసే వ్యక్తులను ఎప్పటికీ మరువదని రాష్ట్ర తొలి మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్ చంద్రయ్య అన్నారు. తమ కోసం జీవించే వారి కన్నా ఇతరుల కోసం జీవించే ప్రతి ఒక్కరు దేశానికి ఆదర్శనీయమని అన్నారు. విశ్వగురువు వరల్డ్ రికార్డ్స్ సంస్థ అందజేసిన స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై... కరోనా సమయంలో పలు రంగాల్లో సేవలందించిన వారికి అవార్డులు అందజేశారు.
విపత్కర పరిస్థితుల్లోనూ సేవలందించిన వారికి అవార్డులు అందజేస్తున్నందుకు విశ్వగురువు వరల్డ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకుడు సత్యవోలు రాంబాబును అభినందించారు. కూకట్పల్లిలోని భారత్ వికాస్ పరిషత్ ఛారిటబుల్ ట్రస్ట్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో సామాజిక సేవ, సాహిత్యం, చిత్రలేఖనం, పాత్రికేయులు, సంగీతం, నృత్యం, కళలు, క్రీడలు, విద్య, వైద్యం, వ్యవసాయం, నూతన ఆవిష్కరణలు, మ్యాజిక్, నాటకరంగం తదితర అంశాల్లో సేవలందించిన వంద మందికి ఈ అవార్డులను ప్రదానం చేశారు.
ఇదీ చదవండి: ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నివాసంపై రాళ్ల దాడి