ETV Bharat / state

లాక్​డౌన్​ను పరిశీలించిన హెచ్​ఆర్సీ ఛైర్మన్​ - justice chandraiah latest news

హైదరాబాద్​ నగరంలో లాక్​డౌన్​ అమలు తీరును రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్వచ్ఛందంగా లాక్​డౌన్​ పాటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పోలీసులు, ఆరోగ్య, పారిశుద్ధ్య సిబ్బందికి అభినందనలు తెలియజేశారు.

human rights commission chairman observed lockdown execution in hyderabad
లాక్​డౌన్​ను పరిశీలించిన హెచ్​ఆర్సీ ఛైర్మన్​
author img

By

Published : May 15, 2021, 7:43 PM IST

రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్​డౌన్ హైదరాబాద్ నగరంలో ఎలా అమలు అవుతుందో తెలుసుకునేందుకు... రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య క్షేత్రస్థాయిలో పర్యటించారు. లాక్​డౌన్ అమలును స్వయంగా గమనించే ప్రయత్నంలో భాగంగా... జస్టిస్ జి. చంద్రయ్య హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్స్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో పర్యటించారు. పలు ప్రాంతాల్లోని చెక్​పోస్టుల వద్ద పోలీసు సిబ్బందితో మాట్లాడారు. రికార్డులను పరిశీలించి, వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే, ఆయా ప్రాంతాల ప్రజల స్పందనలను తెలుసుకున్నారు.

ముఖ్యంగా పాతబస్తీలో స్పెషల్ పోలీస్ ఫోర్స్ వారిని కలిశారు. అక్కడి ప్రజలు లాక్​డౌన్​ను మనస్పూర్తిగా, స్వచ్ఛందంగా పాటిస్తున్నారని తెలుసుకొని హర్షం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారిని కట్టడి చేయాలంటే లాక్​డౌన్​ ఒక్కటే ఆయుధమని సూచించారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం పోలీసులు, ఆరోగ్య, పారిశుద్ధ్య ఇతర సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

ఇవీ చదవండి: నేడు, రేపు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ నిలిపివేత

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.