బంజారాహిల్స్ రోడ్డు నంబరు 12లోని ఒక వ్యాపారి ఇంట్లో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ రవి కుమార్ కథనం ప్రకారం రోడ్డు నంబరు 12లో నివాసం కపిల్ గుప్తా అనే వ్యాపారి ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. సోమవారం ఉదయం తిరిగి వచ్చిన ఆయన గదిలోని అల్మారా తెరచి ఉండటాన్ని గమనించారు. అందులో పరిశీలించగా సుమారు. రూ.కోటి విలువైన వజ్రాల హారం ఒకటి కనిపించలేదు. అదే సమయంలో ఇంట్లో పనికి చేరిన వ్యక్తి కూడా అదృశ్యమైనట్లు గుర్తించారు. 40 రోజుల కిందట బిహార్‌కు చెందిన రామ్ నివాస్ అలియాస్ కరణ్ అనే వ్యక్తి వ్యాపారి ఇంట్లో పనికి చేరాడు. దీంతో అనుమానం వచ్చిన వ్యాపారి కరణ్ చరవాణికి కాల్ చేయగా స్విచ్ఛాఫ్ అని వస్తోంది. అనుమానం వచ్చిన వ్యాపారి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సిట్ ఏర్పాటు