ETV Bharat / state

సొంతూరు బాట పట్టిన జనం, ఖాళీ అయిన భాగ్యనగరం - రికార్డు సృష్టించిన ఆర్టీసీ - heavy public tsrtc bus stands

Huge Rush in TSRTC Buses : సంక్రాంతి వేళ సొంతూళ్లకు ప్రయాణమయ్యారు ప్రజలు. గత మూడు రోజులుగా టీఎస్​ఆర్టీసీ బస్ స్టాండ్లు కిక్కిరిసిపోయాయి. కాగా 13వ తేదీ ఒక్క రోజే 52.78 లక్షల మంది ప్రయాణికులు తరలి వెళ్లినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.

Over 52lakh People Travelled in TSRTC
Huge Rush in TSRTC Buses
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 14, 2024, 10:01 PM IST

Huge Rush in TSRTC Buses : సంక్రాంతి పండుగకు నగరం ఖాళీ అయ్యింది. నగర ప్రజలు సొంతూళ్లకు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. శనివారం ఒక్క రోజే 52.78 లక్షల మంది ప్రయాణికులు తరలివెళ్లినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. అందులో సగానికి పైగా మహిళా ప్రయాణికులే ఉన్నట్లు సంస్థ పేర్కొంది. ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం పట్ల సంస్థ సంతోషం వ్యక్తం చేసింది.

పండుగ తెచ్చిన రద్దీ - కిక్కిరిసిపోయిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు

టీఎస్​ఆర్టీసీ బస్సుల్లో భారీ సంఖ్యలో ప్రయాణికులు సొంతూళ్లకు వెళ్లిపోయారు. సంక్రాంతికి టీఎస్​ఆర్టీసీ బస్సులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని సంస్థ వెల్లడించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో నిన్న ఒక్క రోజే 1,861 ప్రత్యేక బస్సులను వివిధ ప్రాంతాలకు సంస్థ నడిపింది. అందులో 1,127 హైదరాబాద్‌ సిటీ బస్సులను ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న కరీంనగర్‌, వరంగల్, విజయవాడ, ఖమ్మం, తదితర రూట్లలో తిప్పినట్లు సంస్థ వెల్లడించింది.

సంక్రాంతి పండుగ సందర్బంగా 4,484 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని సంస్థ ప్రణాళిక వేసింది. కానీ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఈ నెల 11, 12, 13 తేదీల్లోనే 4,400 ప్రత్యేక బస్సులను నడిపినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ నెల వరకు మొత్తంగా 6,261 ప్రత్యేక బస్సులను నడిపినట్లు అధికారులు వివరించారు. భోగి రోజు కూడా 652 ప్రత్యేక బస్సులను నడిపించాలని ప్రణాళిక వేయగా, మధ్యాహ్నం వరకు 450 బస్సులను సంస్థ తిప్పినట్లు అధికారులు తెలిపారు.

సంక్రాంతి ఎఫెక్ట్ - హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్

Over 52lakh People Travelled in TSRTC : ఈ నెల 13వ తేదీ ఒక్కరోజే 52.78 లక్షల మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చినట్లు సిబ్బంది వెల్లడించారు. అందులో సగానికిపైగా మహిళా ప్రయాణికులే ఉన్నారని పేర్కొన్నారు. మహాలక్ష్మి ఉచిత ప్రయాణం పథకాన్ని ఉపయోగించుకొని మహిళలంతా సొంతూళ్లకు వెళ్లారని సంస్థ పేర్కొంది.

ముందస్తు ప్రణాళికతో పాటు సిబ్బంది సమన్వయంతో పని చేయడం వల్ల సంక్రాంతికి ఎలాంటి ఘటనలు జరగకుండా ప్రశాంతంగా ప్రయాణికులను సొంతూళ్లకు సంస్థ చేర్చిందని అధికారులు పేర్కొన్నారు. తొలిసారిగా బస్‌ భవన్​​లో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్​ను ఏర్పాటు చేసి, రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను ప్రయాణికులకు అందుబాటులో ఉంచామన్నారు. సంక్రాంతికి ప్రశాంతంగా ప్రజలను సొంతూళ్లకు చేర్చడంలో పాలుపంచుకున్న టీఎస్‌ఆర్టీసీ సిబ్బంది, అధికారులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కృతజ్ఞతలు తెలిపారు.

సంక్రాంతి ఎఫెక్ట్ - పంతంగి టోల్​ప్లాజా వద్ద వాహనాల రద్దీ

ఊరెళ్తున్న భాగ్యనగరం - ప్రయాణికులతో కిక్కిరిసిన బస్టాండ్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.