ETV Bharat / state

పెండింగ్‌ చలాన్ల చెల్లింపులకు విశేష స్పందన - హ్యాంగైన సర్వర్ - rta telangana

Huge Response on Traffic Pending Challans : ట్రాఫిక్‌ పెండింగ్ చలాన్ల చెల్లింపులకు వాహనాదారుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 9.61 లక్షల చెల్లింపులు జరగ్గా రూ 8.44 కోట్ల ఆదాయం వచ్చినట్లు రవాణా శాఖ పేర్కొంది. అయితే చలాన్లు కట్టినా ఇంకా సదరు నంబరు కలిగిన వాహనంపై అదే చలాన్లు కనిపిస్తే సమస్య తెలిపేందుకు లావాదేవీ జరిపిన ఐడి, వాహనం నంబర్, పేమెంట్ చేసిన తేదీ, పేమెంట్ మోడ్ వివరాలు హెల్ప్ డెస్క్‌కు పంపితే సమస్య పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు.

Traffic Pending Challans
Huge Response on Traffic Pending Challans
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 28, 2023, 8:03 PM IST

Updated : Dec 28, 2023, 9:44 PM IST

Huge Response on Traffic Pending Challans : రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ట్రాఫిక్‌ చలాన్ల(Traffic challans) చెల్లింపులకు రాయితీ ప్రకటించడంతో ఖజానాకు కాసులపంట పండుతోంది. వాహనాదారులు పేరుకుపోయిన ట్రాఫిక్‌ చలాన్లపై పెద్దసంఖ్యలో చెల్లింపులు చేస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 9.61 లక్షల చలాన్ల చెల్లింపులు జరగ్గా, రూ. 8.44 కోట్ల ఆదాయం సమకూరినట్లు రవాణాశాఖ వర్గాలు పేర్కొన్నాయి.

Burning Vehicle Pending Traffic Challan : పెండింగ్‌ ట్రాఫిక్‌ చలానా కట్టమన్నందుకు.. ఏకంగా బైక్‌కే నిప్పు

ఇందులో హైదరాబాద్ పరిధిలో 3.54 లక్షల చలాన్ల చెల్లింపులకు గానూ రూ 2.62 కోట్ల ఆదాయం, సైబరాబాద్‌(Cyberabad) పరిధిలో 1.82 లక్షల చలాన్ల చెల్లింపులకు గానూ రూ. 1.80కోట్ల ఆదాయం రాగా రాచకొండ పరిధిలో 93వేల చలాన్ల చెల్లింపులకు రూ.76.79 లక్షల ఆదాయం వచ్చింది. వాహనాదారులు పెండింగ్‌ చాలన్లను క్లియర్‌ చేసేందుకు ఈ- చలాన్‌ సైట్‌ను ఆశ్రయించడంతో సర్వర్ హ్యాంగ్ అవుతోంది.

కాగా అధిక సంఖ్యలో చెల్లింపులు జరుగుతుండటంతో పలుమార్లు సర్వర్ మొరాయిస్తోందని సాంకేతిక బృందం సమస్యలు పరిష్కరిస్తుందని వెల్లడించారు. అయితే చలాన్లు కట్టినా కూడా ఇంకా సదరు నంబరు కలిగిన వాహనంపై అదే చలాన్లు కనిపిస్తే సమస్య తెలిపి లావాదేవీ జరిపిన ఐడి, వాహనం నంబర్, పేమెంట్ చేసిన తేదీ, పేమెంట్ మోడ్ వివరాలు హెల్ప్ డెస్క్‌కు పంపితే సమస్య పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు.

Wrong e Challan Complaint in Online : మీకు తప్పుడు చలాన్ వచ్చిందా.. ఇప్పుడేం చేయాలి..?

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్‌ చలానాలను వసూలు చేసేందుకు పోలీస్​ శాఖ(Telangana Police) భారీగా రాయితీలు ప్రకటించింది. ఈ నెల 26 నుంచి జనవరి 10 వరకు రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్ల వారికి 90 శాతం, ద్విచక్ర వాహనాల చలాన్లపై 80 శాతం, ఫోర్ వీలర్స్, ఆటోల చలాన్లపై 60 శాతం, లారీలు, ఇతర భారీ వాహనాల చలాన్లపై 50 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. ఆన్‌లైన్‌, మీ సేవా కేంద్రాల్లో చలాన్లు చెల్లించే అవకాశాన్ని కల్పించింది.

Discount on Telangana E Challan 2023 : గతేడాది మార్చి 31 నాటికి రాష్ట్రంలో 2.4 కోట్ల చలానాలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వంలో ప్రత్యేక రాయితీ ఇచ్చారు. ఈ ప్రకటనపై వాహనదారుల నుంచి విశేష స్పందన వచ్చింది. కేవలం 45 రోజుల వ్యవధిలో రూ.300 కోట్ల చెల్లింపులు చేశారు. దాదాపు 65 శాతం మంది చలానాలు చెల్లించారు.

How to Check Status of TS e-Challans Online : మీరు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించారా.. ఇప్పుడే మీ ఇ-చలాన్ స్టేటస్ చెక్ చేసుకోండిలా.!

Last Updated : Dec 28, 2023, 9:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.