హైదరాబాద్ జూబ్లీహిల్స్లో రహదారిపై భారీ గుంత ఏర్పడింది. అధిక బరువుతో డ్రైనేజీపై లారీ వెళ్లడం వల్ల రహదారిపై గుంత ఏర్పడి డ్రైనేజీ పైపు పగిలిపోయింది. జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 10 నుంచి చెక్పోస్ట్ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పిందని వెల్లడించారు. ఏఎస్ రావు ఘటన మరవకముందే మరో ప్రమాదంతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు.
- ఇదీ చూడండి ప్రగతిభవన్ ఎదుట ఆటోడ్రైవర్ ఆత్మహత్యాయత్నం