Huge Iphones Seized in Abids : తమకు హోల్‌సేల్ ధరలో పెద్ద సంఖ్యలో ఐ ఫోన్‌లు కావాలని ఫోన్ షాపు యాజమానికి కాల్ చేశారు. తాము చెప్పిన ప్రాంతానికి వాటిని కొరియర్ పంపాలని అడ్రస్ పంపారు. కొరియర్ అందిన వెంటనే డబ్బులు చెల్లిస్తామని సదరు వ్యక్తిని నమ్మబలికారు. ఇదంతా నిజమని నమ్మిన ఫోన్ షాపు యాజమాని వారు చెప్పినట్లుగా చేశాడు. తీరా మాల్ పంపించాక, ఎటువంటి సమాధానం లేకపోవడంతో సదరు యజమాని షాకయ్యాడు. తాను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన అబిడ్స్‌లో చోటుచేసుకుంది.
'నీ పెళ్లికి పెట్టిన ఖర్చులు తిరిగిచ్చేయ్' - అన్నా వదినల వేధింపులతో యువకుడి ఆత్మహత్య
Iphone Cheater Arrest in Abids : ఐ ఫోన్‌లు కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని హైదరాబాద్ అబిడ్స్(Abids) పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.64 లక్షల విలువ చేసే 102 ఐ ఫోన్‌లను సీజ్(IPhones Seize) చేశారు. అబ్దుల్లా విరాని అనే వ్యక్తికి జగదీశ్ మార్కెట్‌లో ఓ మొబైల్ షాప్ ఉంది. గుజరాత్‌కు చెందిన విపుల్, నిరావ్‌రాజ్ అనే ఇద్దరు వ్యక్తులు హోల్‌సేల్‌గా ఐ ఫోన్‌లు కావాలని అబ్దుల్లా విరానిని గతేడాది నవంబర్ 29న కోరినట్లు పోలీసులు తెలిపారు.
సెల్‌ఫోన్లు అందగానే డబ్బులు ఖాతాకు బదిలీ చేస్తామని నిందితులు నమ్మబలికారని వెల్లడించారు. వారి మాటలు నమ్మిన మొబైల్ షాపు నిర్వాహకుడు అబ్దుల్లా విరాని 107 ఐ ఫోన్‌లను వారు చెప్పిన చిరునామాకు కొరియర్ చేశాడు. ఫోన్లు తీసుకున్న నిందితులు రోజులు గడుస్తున్నా డబ్బులు చెల్లించకుండా స్పందించకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు గతేడాది డిసెంబర్ 8న పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కూతురిపై కన్నతండ్రి అత్యాచారం - తప్పించుకునే క్రమంలో మరో డేంజర్లోకి
కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గుజరాత్‌కు పంపించారు. గుజరాత్లో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, A2గా ఉన్న నీరావ్‌రాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 102 ఐ ఫోన్‌లను సీజ్ చేశామని మధ్య మండల డీసీపీ శరత్‌చంద్ర పవార్ తెలిపారు. పరారీలో ఉన్న A1 నిందితుడు విపుల్‌ను త్వరలోనే పట్టుకుంటామని డీసీపీ స్పష్టం చేశారు.
"అబ్దుల్లా విరాని అనే వ్యక్తికి జగదీశ్ మార్కెట్‌లో ఓ మొబైల్ షాప్ ఉంది. గుజరాత్‌కు చెందిన విపుల్, నిరావ్‌రాజ్ అనే ఇద్దరు వ్యక్తులు హోల్‌సేల్‌గా ఐ ఫోన్‌లు కావాలని అబ్దుల్లా విరానిని కోరారు. వారి మాటలు నమ్మిన మొబైల్ షాపు నిర్వాహకుడు అబ్దుల్లా విరాని 107 ఐ ఫోన్‌లను వారు చెప్పిన చిరునామాకు కొరియర్ చేశాడు. ఫోన్లు తీసుకున్న నిందితులు రోజులు గడుస్తున్నా డబ్బులు చెల్లించకుండా స్పందించకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు గతేడాది డిసెంబర్ 8న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. A2గా ఉన్న నీరావ్‌రాజ్‌ను పట్టుకున్నాం. A1 నిందితుడు విపుల్‌ను త్వరలోనే పట్టుకుంటాం". - శరత్ చంద్ర, మధ్య మండల డీసీపీ