ETV Bharat / state

శ్రీశైలానికి భారీ వరద.. అప్రమత్తమైన అధికారులు

శ్రీశైలం జశాయానికి జూరాల, తుంగభద్ర ప్రాజెక్టుల నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయం నిండుకుండను తలిపిస్తుంది. ఎగువ నుంచి వరద నీటి ఉద్ధృతి ఉండడం వల్ల ఆదివారం సాయంత్రం 3లక్షల క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టు అధికారులు దిగువకు విడుదల చేశారు.

huge inflow to the srisailam dam
శ్రీశైలానికి భారీ వరద.. అప్రమత్తమైన అధికారులు
author img

By

Published : Sep 21, 2020, 8:15 AM IST

ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతుండడం వల్ల రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నింటికీ వరద భారీగా వచ్చి చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు ఆదివారం సాయంత్రానికి 3.13 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. దిగువకు మూడు లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. ఎగువ ప్రాంతాల్లోని తుంగభద్ర, జూరాల నుంచి క్రమంగా వరద పెరుగుతుండటం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు.

కృష్ణ, గోదావరి పరివాక జలాశయాలకూ వరద ప్రవాహం..

నాగార్జునసాగర్‌కు 2.50 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా 14 గేట్లు ఎత్తి పులిచింతల వైపు అంతే మొత్తంలో నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు గోదావరి పరీవాహకంలో కూడా జలాశయాలకు ప్రవాహం కొనసాగుతోంది. శ్రీరామసాగర్‌ ప్రాజెక్టుకు ఎగువ నుంచి 1.46 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా వరద కాలువతో పాటు గేట్లు ఎత్తి దిగువకు అంతే మొత్తంలో విడుదల చేస్తున్నారు.

కాళేశ్వరం బ్యారేజీలకు నీటి ఉద్ధృతి..

దీనితో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద వరద ఉద్ధృతి పెరిగింది. కాళేశ్వరం సాధారణ పుష్కర ఘాట్‌ వద్ద మెట్లను తాకుతూ 9 మీటర్ల(29.7 అడుగులు) నీటి మట్టం నెలకొంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ(మేడిగడ్డ) బ్యారేజీకి ప్రవాహం పెరిగింది. 3,55,500 క్యూసెక్కుల ప్రవాహం ఉండడంతో 46 గేట్ల ద్వారా 3,02,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. సరస్వతి(అన్నారం) బ్యారేజీకి 1,40,000 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండటంతో 30 గేట్ల ద్వారా అంతే స్థాయిలో నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 1.56 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు.

ఇదీ చూడండి: సాగర్​కు భారీ వరద.. 16 గేట్లు ఎత్తివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.