ETV Bharat / state

కోలాహలంగా ఖైరతాబాద్​.. ​ లంబోదరుడి దర్శనానికై జనసందోహం - ఖైరతాబాద్ గణేశుడు వద్ద భక్తల సందడి

ఖైరతాబాద్‌లో కొలువుదీరిన మహాగణపతి దర్శనానికి  భారీగా భక్తులు తరలివచ్చారు. భక్తులుతోపాటు  రాజకీయ ప్రముఖుల రాకతో కోలాహలంగా మారింది. లంబోదరుణ్ని తెరాస ఎమ్మెల్సీ కవితా, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, భాజపా నాయకురాలు విజయశాంతి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దేవసేవ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా.. భక్తులకు మహాగణపతి ఆశీస్సులు లభిస్తున్నాయి.

huge devotees rush at khairatabad ganesh
కోలాహలంగా ఖైరతాబాద్​.. ​ లంబోదరుడి దర్శనానికై జనసందోహం
author img

By

Published : Sep 7, 2022, 9:57 AM IST

కోలాహలంగా ఖైరతాబాద్​.. ​ లంబోదరుడి దర్శనానికై జనసందోహం

రాష్ట్ర ప్రజలందరు ఎంతో ఆసక్తిగా తిలకించే ఖైరతాబాద్‌ వినాయకుడికి రోజురోజుకు భక్తులు రద్దీ పెరుగుతోంది.నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు గణేషుడిని సందర్శించుకునేందుకు తరలివస్తున్నారు. లంబోదరుడి ఆశీస్సుల కోసం పెద్దసంఖ్యలోతరలివస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా వినాయకుడిని ప్రతి ఒక్కరు పూజించాలని భాజపా నాయకురాలు విజయశాంతి కోరారు.

ప్రజలందరు మంచిగా జీవించాలని కుల, మతాలకు ప్రాంతీయ బేధం లేకుండా ఉండాలన్నారు. ఖైరతాబాద్‌ మహాగణపతిని తెరాస ఎమ్మెల్సీ కవిత దర్శించుకున్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని.. ప్రజలంతా సుఖ శాంతులో జీవించాలని కోరుకున్నట్లు ఆమె చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు వర్చువల్‌ ద్వారా ఖైతరాబాద్‌ మహాగణపతిని దర్శించుకునేందుకు టీ-హబ్ ఆధారిత అంకుర కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టింది. "దేవసేవ స్టాటప్" అందుబాటులోకి తెచ్చింది.

ప్రపంచం లేదా దేశంలో ఎక్కడ ఉన్నా నేరుగా విచ్చేసి దర్శనం చేసుకోలేని భక్తులకు. ఇదొక అద్భుతమైన అవకాశమని నిర్వాహకులు చెబుతున్నారు. ఆన్‌లైన్‌లో తమ పేరిట పూజాసేవల ద్వారా ప్రార్థించే అవకాశం సహా... భక్తుల ఇంటి వద్దకు దైవిక ప్రసాదం పంపుతున్నారు. భక్తుల రద్దీతో ఖైరతాబాద్‌ ప్రాంగణం కోలాహలంగా మారింది. నిమజ్జనానికి కొద్దిరోజులు మాత్రమే మిగిలి ఉండటంతో రద్దీకి అనుగుణంగా పోలీసులు చర్యలు చేపడుతున్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.