ETV Bharat / state

Gardening plants for home: గార్డెనింగ్​లో న్యూ ట్రెండ్.. ఈ ఆకారంలో మొక్కలు మీరెప్పుడైనా చూశారా? - gardening plants for home

కాంక్రీటు భవనాల మధ్య పచ్చదనాన్ని పెంపొందించాలని ఇటీవల చాలామంది అనుకుంటున్నారు. అందుకే గార్డెనింగ్​పై(Gardening plants for home) ప్రత్యేక శ్రద్ధ కనబర్చుతున్నారు. అందుకు తగినవిధంగా రెగ్యులర్​ మొక్కలే కాకుండా వెరైటీ ప్లాంట్స్​ కూడా ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్నాయి. దేవుని ఆకారంలో ఉండే మొక్కలు కూడా మార్కెట్​లోకి వచ్చాయి. అందుకు నిదర్శనమే ఈ మొక్క.

gardening plants for home, plants for home garden in india
గార్డెనింగ్​లో న్యూ ట్రెండ్
author img

By

Published : Nov 17, 2021, 4:05 PM IST

మొక్కలు పెంచాలనుకుంటే విశాలమైన ప్రదేశం ఉండాలని ఒకప్పుడు అనుకునేవారు. కానీ టెర్రస్ గార్డెన్, ఇండోర్ ప్లాంట్స్ వంటివి అందుబాటులోకి వచ్చాక చాలామంది పచ్చదనంపై ప్రత్యేక ఆసక్తి కనబర్చుతున్నారు. ఇటీవల కాలంలో ఎక్కువ మంది మొక్కల పెంపకంపై(Gardening plants for home) ఆసక్తి చూపుతున్నారు. పిల్లలు, పెద్దలతో పాటు యువత కూడా గార్డెనింగ్​పై(Gardening plants for home) ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఇందుకు తగినట్లుగానే వైవిధ్యభరితమైన మొక్కలు అందుబాటులోకి వస్తున్నాయి. రెగ్యులర్ ప్లాంట్స్ కాకుండా విభిన్న ఆకారాల్లోనూ పెంచుతున్నారు. అంతేకాదు దేవుడి రూపంలోనూ మొక్కలు పెంచడం గమనార్హం.

gardening plants for home, plants for home garden in india
శివ లింగం ఆకారంలోని మొక్కలకు డిమాండ్

నర్సరీల్లో వివిధ టెక్నిక్స్ ఉపయోగించి మొక్కలను వివిధ ఆకారాల్లో పెంచుతున్నారు. ఇక్కడ చూస్తున్నది పచ్చని శివలింగం అనుకుంటే పొరబడినట్లే. బోర్డర్ మొక్కలను శివలింగం ఆకారంలో పెంచారు. పుణెలోని ఓ నర్సరీలో ఈ శివలింగం మొక్కలను పెంచుతున్నారు. వీటికి ప్రస్తుతం భారీ డిమాండ్ ఉంది. అందుకే నర్సరీ యజమానులు వీటిని పుణె నుంచి ప్రత్యేకంగా తెప్పించి... విక్రయిస్తున్నారు. అయితే ఈ మొక్కలను కొనడానికి నగరవాసులు సైతం బాగా ఆసక్తి కనబర్చుతున్నారని నర్సరీ నిర్వాహకులు చెబుతున్నారు. ఇక రేటు విషయానికి వస్తే మొక్కను బట్టి రూ.14 వేల నుంచి రూ.20 వేల వరకు అమ్ముతున్నామని తెలిపారు.

నగరంలో పెరిగిన కాలుష్యం... బిజీ షెడ్యూల్​లో కాసేపు మొక్కలకు కేటాయించి మానసిక ప్రశాంతత పొందాలనే కాంక్షతో భాగ్యనగరవాసులు మొక్కల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. పైగా కొత్తరకమైన మొక్కలను పెంచడానికి చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. రెగ్యులర్​కు భిన్నంగా తమ ఇంట్లో వెరైటీ ప్లాంట్ ఉండాలనే ఉద్దేశంతో ధరతో సంబంధం లేకుండా కొంటున్నారు.

ఇదీ చదవండి: terrace gardening: మెుక్కలంటే ప్రాణం.. ఇంటి ఆవరణమంతా పచ్చదనం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.