రాష్ట్రంలో కొత్తగా 1,921 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా 9 మరణాలను వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 88,396కు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు కొవిడ్‌తో 674 మంది మృతి చెందారు. తాజాగా కరోనా నుంచి కోలుకుని మరో 1,210 మంది డిశ్చార్జయ్యారు.
23,438 యాక్టివ్ కేసులు...
మొత్తంగా కరోనా మహమ్మారి నుంచి కోలుకుని 64,284 మంది డిశ్చార్జయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 23,438 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 356 కరోనా కేసులను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు.
22,046 మందికి పరీక్షలు...
తాజాగా 22,046 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో 1,921 మందికి వైరస్ నిర్థారణ కాగా మరో 1151 రిపోర్టులు రావాల్సి ఉందని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 23,438 యాక్టవ్ కేసులు ఉన్నాయి. అందులో 16,439 మంది ఐసోలేషన్‌లో ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
గ్రేటర్లో 356 కేసులు...
జీహెచ్ఎంసీ పరిధిలో 356 కొవిడ్ పాజిటివ్ కేసులను గుర్తించారు. ఆదిలాబాద్‌లో 28, కొత్తగూడెం 34, జగిత్యాల 40, జనగామ 38, భూపాలపల్లి 21, గద్వాల్ 51, కామారెడ్డి 44, కరీంనగర్ 73, ఖమ్మం 71, ఆసిఫాబాద్ 17, మహబూబ్ నగర్ 48, మహబూబాబాద్ 38 , మంచిర్యాల జిల్లాల్లో 18 కేసులను గుర్తించినట్లు వివరించింది. మెదక్ జిల్లాలో 39 కొవిడ్ కేసులు, మల్కాజ్ గిరి 168, ములుగు 12 , నాగర్ కర్నూల్ 26 , నల్గొండ 73, నారాయణ పేట్ 6 , నిర్మల్ 37, నిజామాబాద్ 63, పెద్దపల్లి 54, సిరిసిల్ల 33, రంగారెడ్డి 134, సంగారెడ్డి 90, సిద్దిపేట 63, సూర్యాపేట 47, వికారాబాద్ 14, వనపర్తి 41, వరంగల్ రూరల్ 54, వరంగల్ అర్బన్ 74, యాదాద్రి జిల్లాలో 16 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వెల్లడించింది.