ప్రస్తుత ఉపకులపతుల పదవీ కాలం నేటితో ముగియనున్నందున కొత్త వీసీల నియామకం కోసం ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. ఒక్కో ఆచార్యుడు నాలుగైదు యూనివర్సిటీల కోసం విద్యాశాఖ కార్యదర్శికి దరఖాస్తులను సమర్పించారు. యూజీసీ నిబంధనల ప్రకారం పదేళ్ల బోధనానుభవం ఉన్న వారు ఉపకులపతికి అర్హులు. ఆచార్యులుగా పనిచేస్తున్న వారు.. పదవీ విరమణ పొందిన వారు... ఉపకులపతి కుర్చీ కోసం పోటీ పడుతున్నారు.
అత్యధికంగా ఓయూ నుంచే....
అత్యధికంగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సుమారు 60 మంది రేసులో ఉన్నారు. పదవీ విరమణ పొందిన ఆచార్యులు మరో ఇరవై మంది వరకు ప్రయత్నిస్తున్నారు. ప్రతి విశ్వవిద్యాలయానికి సుమారు 10 మంది వరకు పోటీ పడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్‌తో సన్నిహితంగా ఉన్న నేతల చుట్టూ పలువురు ఆచార్యులు చక్కర్లు కొడుతున్నారు.
ఇదీ చూడండి: మంత్రివర్గ విస్తరణ ఉంటుందా? ఉండదా?