ETV Bharat / state

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణానికి భారీ ఏర్పాట్లు - talasani

జులై నెలలో జరగనున్న ఎల్లమ్మ కల్యాణాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు శుక్రవారం స్థానిక అమీర్​పేట డివిజన్​ లోని బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వేడుక నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణానికి భారీ ఏర్పాట్లు
author img

By

Published : Jun 28, 2019, 6:35 PM IST

భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న బల్కంపేట ఎల్లమ్మతల్లి కల్యాణోత్సవాన్ని ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. జులై తొమ్మిదో తేదీన అమ్మవారి కల్యాణం, పదో తేదీన రథోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ తెలిపారు.

అంగరంగ వైభవంగా జరిగే బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణోత్సవానికి రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున భక్తులు తరలివస్తారని ఆయన పేర్కొన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్​, పోలీస్​, విద్యుత్​, ఆర్​ అండ్​ బీ, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణానికి భారీ ఏర్పాట్లు

ఇదీ చూడండి: నాటుకోడి పులుసు,అంబలి@ తెలంగాణ ఫుడ్​ ఫెస్టివల్​

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.