ETV Bharat / state

హెచ్​సీయూ ప్రవేశాలకు రికార్డు స్థాయిలో దరఖాస్తులు - హైదరాబాద్​ సెంట్రల్​ యూనివర్సిటీ వార్తలు

హెచ్‌సీయూ ప్రవేశాల కోసం రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. ప్రవేశాల కోసం 62,853 మంది దరఖాస్తు చేసుకున్నట్లు హెచ్​సీయూ పరీక్ష విభాగం తెలిపింది.

huge applications to hcu for pg entrence in hyderabad
హెచ్​సీయూ ప్రవేశాలకు రికార్డు స్థాయిలో దరఖాస్తులు
author img

By

Published : Jul 14, 2020, 6:01 PM IST

Updated : Jul 14, 2020, 9:58 PM IST

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రవేశాల కోసం రికార్డు స్థాయిలో దరఖాస్తులు అందాయి. ప్రవేశ పరీక్షకు గతేడాది 56 వేల దరఖాస్తులు రాగా.. ఈ ఏడాది అత్యధికంగా 62 వేల 853 దరఖాస్తులు వచ్చాయని హెచ్​సీయూ వీసీ అప్పారావు తెలిపారు. పురుషుల కన్నా మహిళల నుంచి ఎక్కువగా దరఖాస్తులు సమర్పించారు. హెచ్​సీయూలో 132 కోర్సుల్లో.. 2, 456 సీట్లు ఉన్నాయి. కరోనా పరిస్థితులు మెరుగు పడిన తర్వాత.. ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటిస్తామని వీసీ తెలిపారు. ఈ ఏడాది తెలంగాణ నుంచి 28 వేల 618, కేరళ నుంచి 7,019, ఢిల్లీ నుంచి 5,082, ఏపీ నుంచి 3, 929, బెంగాల్ నుంచి 3, 878, ఒడిషా నుంచి 3, 349 దరఖాస్తులు వచ్చినట్టు హెచ్ సీయూ వీసీ తెలిపారు.

మహిళలు 51 శాతం, పురుషులు 48.96 శాతం దరఖాస్తు చేసుకోగా.. ట్రాన్స్ జెండర్లు 11 మంది దరఖాస్తులు సమర్పించినట్లు పేర్కొన్నారు. అత్యధికంగా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీలో చేరేందుకు 6,189 దరఖాస్తులు రాగా.. ఆ తర్వాత ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఇమెటిగ్రేడ్ ఎంఏ, ఎంఏ ఇంగ్లీషు, ఎంసీఏ కోర్సులకు ఎక్కువ పోటీ ఉంది. ఈ ఏడాది విదేశీ విద్యార్థుల దరఖాస్తుల సంఖ్య కూడా 20 శాతం పెరిగినట్లు అప్పారావు తెలిపారు.

ఇదీ చూడండి: బాలిక అభ్యర్థనపై స్పందించిన కలెక్టర్..​ స్మార్ట్​ఫోన్​ కానుక

Last Updated : Jul 14, 2020, 9:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.