ETV Bharat / state

తనిఖీల్లో భారీగా పట్టుబడుతోన్న నగదు, ఇప్పటి వరకు 427 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు వికాస్​రాజ్​ వెల్లడి - Telangana assembly election is a huge cash grab

Huge Amount of Money Seized in Telangana : రాష్ట్రంలో ఎన్నికల దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఓటర్లలో అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎప్పటికప్పుడు సమీక్షాసమావేశాలు నిర్వహిస్తున్న ఈసీ.. తాజా పరిస్థితులపై ఆరా తీస్తూ అధికారులకు పలు సూచనలు చేస్తోంది. తనిఖీల్లో పట్టుబడుతున్న నగదు, వివిధ కానుకల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ పట్టుబడిన మొత్తం రూ.427.15 కోట్లని అధికారులు తెలిపారు.

Huge Amount of Money Seized in Telangana
Police checks in Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 2, 2023, 12:44 PM IST

Huge Amount of Money Seized in Telangana రాష్ట్రంలో ఎన్నికల దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు

Huge Amount of Money Seized in Telangana : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తనిఖీల్లో భాగంగా ఇప్పటి వరకు మొత్తం రూ.427.15 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో మొత్తం రూ.14.53 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇందులో రూ.6.09 కోట్ల నగదు, రూ.5.12 కోట్ల విలువైన మద్యాన్ని పట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకూ రూ.23 కోట్ల మత్తు పదార్థాలు పట్టుకున్నామని పేర్కొన్నారు. అలాగే స్వాధీనం చేసుకున్న మొత్తం బంగారం, వెండి, వజ్రాల విలువ రూ.165 కోట్ల విలువ ఉంటుందని వికాస్‌రాజ్ (Vikas Raj) వివరించారు.

Telangana Police Seized RS 3 Crores in Nalgonda : ఎన్నికల ఎఫెక్ట్​.. వాడపల్లి చెక్​పోస్ట్ వద్ద రూ.3 కోట్లు సీజ్.. మరో చోట రూ.6 లక్షలు

Telangana Assembly Election Arrangements 2023 : మరోవైపు నవంబర్‌ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. మునుగోడు ఉపఎన్నిక అనుభవాల నేపథ్యంలో గుర్తుల కేటాయింపు, బ్యాలెట్ పత్రాల ముద్రణ, ఎన్నికల నిర్వహణ,.. తనిఖీలు సహా ఎక్కడా లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించింది. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు హైదరాబాద్‌లో ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించారు.

Central Election Commission on Telangana Election Arrangements 2023 : అనంతరం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్‌తో విడిగా సమావేశమైన ఈసీ అధికారులు.. ఎన్నికల ఏర్పాట్లు, ప్రభుత్వం నుంచి అందాల్సిన సహకారం, శాంతిభద్రతల నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. తనిఖీల్లో స్వాధీనం చేసుకుంటున్న నగదు, కానుకలు, వస్తువుల ధరను లెక్కగట్టి.. నామినేషన్ల ఖరారు తర్వాత ఆయా అభ్యర్థుల ఎన్నికల వ్యయంలో కలపాలని ఈసీ బృందం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ను ఆదేశించింది.

Telangana Assembly Election Nominations : మరో రెండ్రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ.. ఆన్​లైన్​లోనూ దాఖలు చేయొచ్చు.. కానీ..?

ఇదే సమయంలో తగిన సాక్ష్యాలు ఉంటే పట్టుబడుతున్న నగదును వదిలిపెట్టాలని ఈసీ బృందం సూచించింది. ఎన్నికల దృష్ట్యా సీసీఎల్‌ఎ కమిషనర్ నవీన్‌ మిట్టల్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని బదిలీ చేయాలని.. బీఎస్‌ఎన్‌ఎల్ విశ్రాంత అధికారి, ఆర్టీఐ కార్యకర్త ఎంఏ సత్యనారాయణరావు.. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్‌రాజ్‌కు ఫిర్యాదు చేశారు. పదవి విమరణ చేసిన ఐఏఎస్ అధికారులను మళ్లీ ప్రభుత్వ శాఖల్లో నియమించడం పూర్తి రాజ్యాంగ విరుద్ధమని ఆక్షేపించారు.

హనుమకొండ జిల్లా ఆత్మకూరులో వివిధ పార్టీల ముఖ్య కార్యకర్తలతో.. పరకాల ఏసీపీ కిశోర్‌కుమార్ సమావేశం నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా అందరూ సహకరించాలని కోరారు. ఎన్నికల వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుశాఖ పూర్తిగా అప్రమత్తమైంది. మేమున్నామంటూ భరోసా కల్పిస్తూ ప్రజల్లో అవగాహన పెంచుతుంది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో భారీ పోలీస్ కవాతు నిర్వహించారు.

107 Candidates Disqualified From Elections : 107 మంది అభ్యర్థులపై ఈసీ అనర్హత వేటు.. ఆ నియోజకవర్గంలోనే అధికంగా

Telangana Assembly Elections 2023 : ప్రజలు శాంతియుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని.. మహబూబాబాద్ జిల్లాలో పోలీసులు కవాతు నిర్వహించారు. ఓటరు గుర్తింపు కార్డు ఉంటేనే ఓటెయొచ్చనే అపోహ చాలా మందిలో ఉంటుంది. ఇలాంటి అనుమానాలన్నింటికి చెక్ పెడుతూ.. తమ దగ్గర ఉన్న ప్రభుత్వ గుర్తింపు కార్డులతో కూడా ఓటు వేయొచ్చని ఎన్నికల సంఘం తెలిపింది.

భారత ఎన్నికల సంఘం గుర్తించిన 12 రకాల గుర్తింపు కార్డులైన.. ఆధార్‌కార్డ్, పాన్‌కార్డ్, జాబ్‌కార్డ్‌, బ్యాంక్ పాస్‌బుక్, కార్మిక శాఖ ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్, పాస్‌పోర్ట్, పింఛన్‌ డాక్యుమెంట్.. ఇలా వీటిలో ఏ కార్డు ఉన్నా ప్రజలు ఓటును వినియోగించుకునే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఏదేని ఒక గుర్తింపు కార్డుతో పాటు.. ఓటరు లిస్టులో పేరు మాత్రం తప్పనిసరిగా ఉండాలి.

2 Crore Money Seize in Karimnagar : కరీంనగర్​లో రూ.2.36 కోట్లు సీజ్

Police Seize 17 KG Gold in Miyapur : మియాపూర్​లో 17 కిలోల బంగారం, కవాడిగూడలో 2.09 కోట్ల నగదు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.