ETV Bharat / state

తనిఖీల్లో కఠిన వైఖరి అవలంభిస్తోన్న పోలీసులు - 500 కోట్లకు చేరువలో స్వాధీనాల మొత్తం - Election Code in Telangana

Huge Amount of Money Seized in Telangana 2023 : శాసనసభ ఎన్నికల వేళ తనిఖీల్లో పోలీసులు కఠిన వైఖరి అవలంభిస్తున్నారు. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న మొత్తం రూ.480 కోట్లను దాటిపోయింది. ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలని పోలీస్ అధికారులను సీపీ డీఎస్‌ చౌహాన్‌ ఆదేశించారు. సమస్యాత్మకమైన ప్రాంతాలపై దృష్టి సారించాలన్నారు.

Huge Amount of Money Seized in Telangana

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 5, 2023, 10:40 AM IST

శాసనసభ ఎన్నికల వేళ పోలీసుల ముమ్మర తనిఖీలు

Huge Amount of Money Seized in Telangana 2023 : శాసనసభ ఎన్నికల తనిఖీల్లో భాగంగా స్వాధీనాల మొత్తం రూ.480 కోట్లను దాటింది. అక్టోబర్ 9 నుంచి ఇప్పటి వరకు రూ.480.25 కోట్లకు పైగా విలువైన నగదు, బంగారం, మద్యం, డ్రగ్స్ సహా ఇతరత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్(Vikas Raj) తెలిపారు. ఇప్పటివరకూ దాదాపు మూడు కోట్ల విలువైన అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకొని.. 88 కేసులు నమోదు చేసి 23 మందిని అరెస్ట్ చేసినట్లు సరూర్‌నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌ రవీందర్ రావు వెల్లడించారు. దాదాపు 84,400 లీటర్ల మద్యం, 75 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

2 Crore Money Seize in Karimnagar : కరీంనగర్​లో రూ.2.36 కోట్లు సీజ్

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు చెక్‌పోస్ట్ వద్ద ఓ జాతీయ బ్యాంకుకు చెందిన వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. వాహనం నంబరుతోపాటు.. నగదు రవాణాకు సంబంధించిన పత్రాల్లో తేడా ఉండడంతో రూ.77లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలని పోలీస్ అధికారులను సీపీ డీఎస్‌ చౌహాన్‌ (CP DS Chauhan) ఆదేశించారు.

Police Seize 17 KG Gold in Miyapur : మియాపూర్​లో 17 కిలోల బంగారం, కవాడిగూడలో 2.09 కోట్ల నగదు స్వాధీనం

Police Checking in Telangana During Election Code : ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్ల పైనా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల అధికారులతో సీపీ డీఎస్‌ చౌహాన్‌ సమన్వయ సమావేశం నిర్వహించారు. సమస్యాత్మకమైన ప్రాంతాల్లో కఠినమైన బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. చెక్ పోస్టుల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని డీఎస్‌ చౌహాన్ అన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించి రశీదు లేకుండా డబ్బు తరలించే వారిపై చర్యలు తీసుకుంటామని రాజన్నసిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. రుద్రంగి చెక్ పోస్ట్ వద్ద ఆయన స్వయంగా వాహనాలను తనిఖీ చేశారు.

Police Seize Liquor, Gold in Telangana : తనిఖీల్లో భాగంగా పోలీసులు నేతల వాహనాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని ఇంటికి వెళ్తున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) వాహన శ్రేణిని.. వరంగల్ జిల్లా రాయపర్తి చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీ చేశారు. మంత్రి వాహనంతో పాటు ఆయన వెంట ఉన్న ఇతర వాహనాలను నిశితంగా పరిశీలించారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో లంబాడ ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన మంత్రి సత్యవతి రాఠోడ్‌ వాహనాన్ని జంగాలపల్లి వద్ద ప్రధాన రహదారిపై పోలీసులు చెక్‌ చేశారు.

Police Seizes Money During Election Code in Telangana :నర్సంపేట వరంగల్ రోడ్ చెక్‌పోస్ట్ వద్ద భద్రాచలం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పోదెం వీరయ్య కారును పోలీసులు తనిఖీ చేశారు. రూ.20,000 గ్యారంటీ కార్డుల కరపత్రాలు, 177 కండువాలకు సంబంధించి ఎలాంటి బిల్లులు లేకపోవడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ జిల్లా సీపీ అంబర్ కిషోర్ జా చెక్‌పోస్టులను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు.

Telangana Police Seized RS 3 Crores in Nalgonda : ఎన్నికల ఎఫెక్ట్​.. వాడపల్లి చెక్​పోస్ట్ వద్ద రూ.3 కోట్లు సీజ్.. మరో చోట రూ.6 లక్షల

Police Implementation Election Code Strictly in Telangana : ఎక్కడికక్కడ తనిఖీలు, సోదాలు.. ఎలక్షన్​ కోడ్​తో పోలీసుల రెడ్ అలెర్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.