Huge Amount Of Gold Seized Hyderabad 2023 : ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక పోలీసు తనిఖీల్లో హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో భారీగా బంగారం పట్టుబడుతోంది. ద్విచక్రవాహనాలు, కార్లలో తరలిస్తున్న పసిడి బిస్కెట్లు, ఆభరణాలకు ఎలాంటి లెక్కలుండవు. పట్టుబడిన వారిని ప్రశ్నిస్తే సరైన సమాధానం రాదు. ఎన్నికలవేళ చేస్తున్న సోదాల్లోనే ఇంత స్వర్ణం దొరుకుతుందంటే సాధారణ రోజుల్లో ఇంకెంత రవాణా జరుగుతుందో అంచనా వేసుకోవచ్చు. బంగారం అక్రమ రవాణాకి హైదరాబాద్ ప్రధాన అడ్డాగా మారుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Police Checkings in Telangana 2023 : హైదరాబాద్‌లో పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీల్లో రోజూ కిలోలకొద్ది బంగారం పట్టుపడుతూనే ఉంది పాతబస్తీ, బేగంబజార్, సికింద్రాబాద్, అబిడ్స్, కాటేదాన్, ఆధిభట్ల తదితర ప్రాంతాలకి చెందిన.. దళారుల కనుసన్నల్లో భారీఎత్తున దొంగ బంగారం చేతులు మారుతుందనేది బహిరంగ రహస్యం. వివిధ దేశాలనుంచి ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేసి.. అక్రమంగా తీసుకొస్తుంటే స్వాధీనం చేసుకుంటారు.
Gold Smuggling In Telangana Amid Elections 2023 : పుత్తడి తరలించే వారిపై కేసులు నమోదు చేస్తున్నా అక్రమ రవాణాకి అడ్డుకట్ట పడట్లేదు నగరంలోని కొన్ని ట్రావెల్స్ సంస్ధలు దళారులతో చేతులు కలిపి.. పేద, మధ్యతరగతి కుటుంబాలకి చెందిన వారిని పర్యాటక వీసాలపై గల్ఫ్ దేశాలకు పంపుతారు. అక్కడి ఏజెంట్లు వారిని ఆధీనంలో ఉంచుకుంటారు. అనంతరం భారత్ నుంచి వచ్చిన ఆదేశాలతో వివిధ రూపాల్లో బంగారం వారికి అందిస్తారు. ఇచ్చిన సామాగ్రిని.. శంషాబాద్ విమానాశ్రయం బయట ఉన్నవారు తీసుకుంటారని మాత్రమే చెబుతారు. కస్టమ్స్, పోలీసులకు పట్టుబడినా అసలు సూత్రదారులు ఎవరనేది మాత్రం వెలుగులోకిరాదు. సరుకును సరక్షితంగా అప్పగిస్తే ఇచ్చే కమీషన్ 10 నుంచి 25వేలలోపు మాత్రమే ఉంటుందని సమాచారం.
బంగ్లాదేశ్, సౌదీ నుంచి సముద్రమార్గం ద్వారా కేరళ, తమిళనాడు, గుజరాత్‌కి అక్కడ నుంచి దొంగబంగారం నగరానికి చేరుతున్నట్టు అంచనా. 2021లో దేశవ్యాప్తంగా బంగారం స్మగ్లింగ్ కేసులు 2వేల 445 నమోదుకాగా.. 2022 నాటికి 3వేల 982కి చేరాయి. ఈఏడాది 5వేలు దాటొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ కేసుల్లో సుమారు 50శాతం కేరళలోనే నమోదవుతున్నాయి. భాగ్యనగరానికి దొంగచాటుగా రవాణా అవుతున్న బంగారం అధికశాతం గల్ఫ్ దేశాలతోపాటు కేరళ నుంచే చేరుతుందని సమాచారం.
నిబంధనల ప్రకారం పసిడి కొనుగోలు చేస్తే ఆదాయలెక్కల్లో చూపాలి. అదే దొంగ బంగారం కొనుగోలు చేస్తే ఎలాంటి లెక్కలుండవు. తక్కువధరకు ఆశపడి వినియోగదారులు కొనుగోలు చేస్తారు. వివిధ రూపాల్లో నగరానికి వచ్చిన బంగారాన్ని కరిగించి బిస్కెట్లుగా మార్చుతారు. ఆనంతరం తెలుగురాష్ట్రాలతో పాటు, కర్ణాటక, మహారాష్ట్ర తదితరరాష్ట్రాల వ్యాపారులు, దుకాణదారులకు విక్రయిస్తారు. ఆ లావాదేవీల్లో ఎక్కడా రశీదులు, లెక్కల్లో చూపకుండా ‘జీరో’వ్యాపారం నిర్వహిస్తుంటారు. దొంగ బంగారం కరిగించి, ఆభరణాలుగా మార్చేందుకు నగర శివారులో 100కు పైగా కార్ఖానాలున్నట్టు అంచనా. యూపీ, పశ్చిమబెంగాల్, కర్ణాటకకు చెందిన కార్మికులు అధికంగా ఆ కార్ఖానాల్లో పనిచేస్తున్నారు.
Police Checkings in Telangana : పోలీసుల విస్తృత తనిఖీలు.. రూ.130 కోట్ల మార్కును దాటేసిన మొత్తం విలువ