డిగ్రీ ప్రవేశాల కోసం దోస్త్‌కు మొబైల్, ఆన్ లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ సదుపాయం కల్పించినప్పటికీ... మీసేవ ద్వారా దరఖాస్తులకే విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. గ్రామీణ విద్యార్థులకు అవగాహన లేక పోవడంతో పాటు... ఆధార్, మొబైల్ అనుసంధానం వంటి సాంకేతిక సమస్యల కారణంగా..మీ సేవ ద్వారానే ఎక్కువ మంది వివరాలు నమోదు చేసుకుంటున్నారు. ఈనెల 23 నుంచి ఇవాళ్టి వరకు రాష్ట్రవ్యాప్తంగా 42 వేల 491 మంది విద్యార్థులు వివరాలను నమోదు చేసుకున్నారు. వారిలో 23 వేల 845 మంది మీసేవ ద్వారా లాగిన్ కోసం వివరాలు నమోదు చేసుకోగా... మరో 18వేల 646 మంది విద్యార్థులు ఆన్ లైన్లో నమోదు చేసుకున్నారు.
మంచి స్పందన
రాష్ట్రవ్యాప్తంగా 31 వేల 712 మంది ఫీజు చెల్లించారు. వారిలో 22 వేల 787 మంది రిజిస్ట్రేషన్లు చేసుకోగా... 13 వేల 339 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. విశ్వవిద్యాలయ కళాశాలలకు 2 వేల 350 మంది విద్యార్థులు.. ప్రభుత్వ కాలేజీలకు 3వేల 776 మంది వెబ్ ఆప్షన్లు ఇవ్వగా.. ప్రైవేట్ కాలేజీల్లో చేరేందుకు 7 వేల 213 మంది విద్యార్థులు ఐచ్ఛికాలు ఇచ్చారు. విద్యార్థుల నుంచి మంచి స్పందన వస్తోందని... సాంకేతిక సమస్యలు ఉంటే హెల్ప్ లైన్ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని దోస్త్ కన్వీనర్ లింబాద్రి తెలిపారు. ఇవీ చూడండి: ప్రాజెక్టు సర్వేను అడ్డుకున్న భూ నిర్వాసితులు