హైదరాబాద్ చర్లపల్లి పారిశ్రామికవాడలో గత నెల 31న మూతపడిన ఓ రసాయన పరిశ్రమ గోడౌన్లో శుభ్రం చేస్తుండగా భారీ పేలుడు జరిగింది. ఈ పేలుడు ఘటనను రాష్ట్ర మానవ హక్కుల సంఘం సుమోటోగా స్వీకరించింది. మరణించిన వారి కుటుంబానికి... క్షత్రగాత్రులైనవారి కుటుంబాలకు ఎలాంటి పరిహారం అందిందో చెప్పాలని అధికారులను ఆదేశించింది. పెద్ద మొత్తంలో అద్దె వస్తుందని ఈ ఫ్యాక్టరీ, గోడౌన్‌ను తిరిగి ప్రారంభింస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోలేదని కమిషన్ ప్రశ్నించింది.
బాధితులకు వైద్యం ఉచితంగా అందించాలని ఆదేశించింది. నివాస ప్రాంతాల్లో రసాయన ఫ్యాక్టరీ, గోడౌన్లు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించింది. సెప్టెంబర్ 4లోగా సమగ్రంగా వివరణ ఇవ్వాలని.. పరిశ్రమ శాఖ కమిషనర్, జీహెచ్ఎంసీ కమిషనర్‌కు హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది.