ETV Bharat / state

How to Lodge GHMC Complaints Online : మీ బజార్లో సమస్యా..? GHMCకి వాట్సాప్ చేయండి చాలు!

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 6, 2023, 11:38 AM IST

Updated : Sep 6, 2023, 11:48 AM IST

How to Lodge GHMC Complaints Online : హైదరాబాద్​.. అవకాశాలకు అక్షయ పాత్ర మాత్రమే కాదు.. స్థానిక సమస్యలకు కేంద్ర బిందువు కూడా. ఎక్కడ మ్యాన్​ హోల్ నోరు తెరిచి ఉందో తెలియదు. ఎప్పుడు కుక్కలు పిక్కలు పీకుతాయో అర్థంకాదు. డ్రైనేజీ నీళ్లు కాల్వలో కాకుండా.. రోడ్ల మీద పారుతూ ఉంటాయి. కొన్ని చోట్ల బజార్లలో లైట్ల వెలగవు. మరికొన్ని చోట్ల పట్టపగలే అక్రమ నిర్మాణాలు నిట్టనిలువుగా వెలుస్తుంటాయి. ఇలాంటి మరెన్నో సమస్యలపై మీరు అధికారులకు ఫిర్యాదు చేయాలనుకుంటున్నారా..? అయితే.. GHMC నేరుగా అవకాశం కల్పిస్తోంది!

How to Lodge GHMC Complaints in Online
How to Lodge GHMC Complaints Online

How to Lodge GHMC Complaints in Online : గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలో అభివృద్ధి ఎంత వేగంగా విస్తరిస్తోందో.. స్థానికులను సమస్యలు కూడా పీడిస్తూనే ఉన్నాయి. దీంతో.. వీటిని పరిష్కరించేందుకు.. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) సిద్ధమైంది. సమస్యలపై నేరుగా జీహెచ్​ఎంసీకే (https://www.ghmc.gov.in/) కే ఫిర్యాదు చేసే అవకాశాన్ని ప్రజలకు కల్పించింది. మరి, మీ ప్రాంతంలో ఏదైనా సమస్య ఉంటే.. ఇలా కంప్లైంట్ చేయండి.

డ్రైనేజీ ఫిర్యాదులు ఇలా..

Complaint on Drainage : కుండపోతగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ లో నాలాలు పొంగి పొర్లుతున్నాయి. మ్యాన్​ హోల్​లో మునిగి ఓ బాలుడు కూడా మృతి చెందాడు. ఈ నేపథ్యంలో.. మీ ఏరియాలో ఏవైనా డ్రైనేజ్ సమస్యలు ఉంటే.. వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయండి. సత్వరమే స్పందించేందుకు గానూ.. అధికారులు వాట్సాప్ నంబర్ ఇచ్చారు. 9848021665 నంబర్​ కు ఫొటోల ద్వారా మీ ఏరియా పరిస్థితిని తెలుపుతూ ఫిర్యాదు చేయండి.

కుక్కలకు సంబంధించిన ఫిర్యాదులు..

Complaint on Street Dogs : వీధికుక్కలు మనుషులను కరవడమే కాదు.. ఏకంగా ప్రాణాలు కూడా తీస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో.. ముఖ్యంగా పిల్లలు రోడ్డెక్కాలంటేనే భయపడే పరిస్థితులు ఉన్నాయి. నగరంలో కొన్ని చోట్ల కుక్కల బెడద తీవ్రంగా ఉంది. మీ ప్రాంతంలో ఇలాంటి పరిస్థితి ఉంటే.. వెంటనే GHMCకి ఫిర్యాదు చేయండి. ఇందుకోసం హెల్ప్‌లైన్ నంబర్ 040-2111-1111 కాల్ చేయండి. లేదంటా My GHMC యాప్ డౌన్​లోడ్ చేసుకొని.. అందులోనుంచి కూడా కంప్లైట్ చేయండి.

ఉస్మాన్‌నగర్‌లో దారుణ పరిస్థితులు.. ఏ వీధి చూసినా నీరే!

చెట్ల నరికివేతపై ఫిర్యాదులు..

Complaint on cutting of trees : మహానగరం రోజు రోజుకూ కాంక్రీట్ జంగల్​గా మారిపోతోంది. కొన్ని ప్రాంతాల్లోనైతే.. చూడ్డానికి కూడా చెట్టు కనిపించట్లేదు. దీనివల్ల కాలుష్యం తీవ్రత ఎంతగా పెరిగిపోతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే.. ఇలాంటి పరిస్థితుల్లో చెట్లు నాటడం సంగతి పక్కనపెడితే.. ఉన్న చెట్లను నరికేస్తుంటారు కొందరు. అనుమతుల్లేకుండా చెట్లను నరకడం చట్టవిరుద్ధం. ఈ సమస్యపై మీరు ఫిర్యాదు చేయాలనుకుంటే.. టోల్-ఫ్రీ నంబర్ 1800 425 5364కు కాల్ చేయండి. అటవీ శాఖ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తికి జరిమానా విధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

చెత్తపై ఆన్‌లైన్ కంప్లైంట్స్..

Complaint on Garbage : నగరంలో ఎప్పటికప్పుడు చెత్త తొలగించకపోతే.. ఎంతటి దుర్వాసన వస్తుందో చెప్పాల్సిన పనిలేదు. దీనివల్ల గాలి కలుషితం కావడంతోపాటు అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. అందుకే.. ఎప్పటికప్పుడు చెత్త సేకరణ పక్కాగా జరగాల్సి ఉంటుంది. మీ ప్రాంతంలో ఈ విషయంలో ఏదైనా సమస్య ఉంటే.. వెంటనే GHMCకి ఫిర్యాదు చేయండి. ఇందుకోసం టోల్ ఫ్రీ నంబర్ 040-2111-1111 కు కాల్ చేయండి.

వీధి దీపాల ఫిర్యాదులు..

Complaint On Street Lights : రాత్రి వేళ వీధి దీపాలు తప్పక వెలగాల్సి ఉంటుంది. మీ ప్రాంతంలో సమస్య ఉంటే.. మూడు పద్ధతుల ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.

  • ఒకటి వ్యక్తిగతంగా దరఖాస్తు చేయవచ్చు. ఇందుకోసం మున్సిపల్ కార్పొరేషన్‌లోని సంబంధిత అధికారిని కలవాలి.
  • రెండోది టోల్ ఫ్రీ నంబర్ 040-2111-1111 కు కాల్ చేయవచ్చు.
  • మూడోది ఆన్​లైన్ GHMC యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.

ఆక్రమణలు, నిర్లక్ష్యమే... వరద ముంపునకు కారణం

దోమల నివారణకు...

Complaint About Mosquitoes : దోమల వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో అందరికీ తెలిసిందే. నిద్రలేమి సమస్యతోపాటు డెంగ్యూ, మలేరియా వంటి ప్రమాదకర రోగాలు ప్రబలుతాయి. అందుకే.. దోమల నివారణకు ఎప్పటికప్పుడు ఫాగింగ్ చేయాల్సి ఉంటుంది. మీ దగ్గర ఇలాంటిది జరగకపోతే.. టోల్ ఫ్రీ నంబర్ 040-2111-1111 కు కాల్ చేయండి.

GHMC అక్రమ నిర్మాణ ఫిర్యాదు..

Complaint On Illegal constructions : నగరంలో చిన్న వర్షానికి కూడా రోడ్లు ఏరులై పారడానికి అక్రమ నిర్మాణాలే కారణం. అందుకే.. వీటి నిరోధానికి GHMC ప్రయత్నిస్తోంది. మీ ఏరియాలో ఏదైనా అక్రమ నిర్మాణం జరుగుతుంటే.. దానిపై ఫిర్యాదు చేయాలంటే GHMC యాప్ ద్వారా కంప్లైంట్ చేయండి.

వరద ముంపు ప్రాంతాల్లో ఆరోగ్య సమస్యలు..

భారీ వర్షాలకు నిండిన చెరువులు.. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు

Last Updated : Sep 6, 2023, 11:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.