ETV Bharat / state

ganja smuggling : గంజాయి రవాణా వెనుక ఇంత నెట్​వర్క్​ ఉంటుందా..!

author img

By

Published : Dec 19, 2021, 6:03 PM IST

ganja smuggling: గంజాయి.. ఈ మధ్య కాలంలో తరచూ వినిపిస్తున్న పేరు.. నిత్యం ఎక్కడో చోట గంజాయి స్వాధీనం.. వ్యక్తుల అరెస్టు అంటూ వార్తలు కనిపిస్తూనే ఉన్నాయి. ఏళ్లుగా సాగవుతున్న ఈ పంట ఈ మధ్యకాలంలో బాగా పాపులర్​ అయింది. ఒకప్పుడు గంజాయి అంటే ఆవారా బ్యాచ్​గా సేవించే మత్తు పదార్థంగా చెప్పుకునే వారు. కానీ ఇప్పుడు వాళ్లు వీళ్లు అనే భేదం లేదు.. మత్తుకు బానిసైన యువత.. ఖరీదైన మత్తు పదార్థాలు లభించని సమయంలో గంజాని సేవిస్తున్నారు. చాపకింద నీరులా విస్తరించిన ఈ గంజాయి వ్యాపారం వేళ్లు పోసుకుని కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ ఏడాదిలో రాచకొండ పరిధిలో 5వేల కిలోల గంజాయి పట్టుబడిందంటే.. మత్తు పదార్థాల రవాణా ఏ స్థాయిలో జరుగుతుందో అర్థమవుతోంది. అసలు ఈ గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది. ఎలా తరలిస్తున్నారు.? అనేది ఓసారి పరిశీలిస్తే..

ganja smuggling
ganja smuggling

ganja smuggling : కొకైన్‌ , హెరాయిన్, ఎల్‌ఎస్‌డీ, ఎఫిడ్రిన్, మెఫిడ్రిన్‌ వంటి ఖరీదైన మత్తు పదార్థాలకు అలవాటుపడిన వ్యక్తులు.. సమయానికి అది లభించకపోతే గంజాయిని ఆశ్రయిస్తున్నారు. దీని రవాణాకు ప్రధానంగా హైదరాబాద్​ను అడ్డాగా మార్చుకున్నాయి పలు ముఠాలు. దీనికి ప్రధాన కారణం.. పలు రాష్ట్రాలకు సరిహద్దులు కలిగి ఉండడం, రైలు, రోడ్డు, విమాన మార్గాలు ఉండడం, సహా మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారు ఎక్కువ ఉండడం, సహా పలు కారణాలు ఉన్నాయంటున్నారు పోలీసులు.

ganja smuggling
ganja smuggling

ఎక్కడి నుంచి తెస్తున్నారు

Cannabis Trafficking :ఏపీలోని ఏవోబీ, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో గంజాయిని సేకరిస్తున్నారు. అక్కడ కిలో గంజాయి క్వాలిటీని బట్టి రూ.8వేల వరకు కొనుగోలు చేస్తారు. అక్కడి నుంచి రాష్ట్ర దాటే కొద్ది దాని రేటు వేలల్లో పెరిగిపోతుంది. రైలు, రోడ్డు మార్గాల్లో ప్రధానంగా గంజాయిని తరలిస్తున్నారు. అందుకు కార్లు, లారీలు, సహా ప్రజా రవాణా వాహనాతో పాటు అంబులెన్సులు ఉపయోగించిన సందర్భాలు చూశాము. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ.. ఎవరికీ అనుమానం రాకుండా బోర్డర్​ దాటించడంలో కొందరు నిష్ణాతులై ఉంటారు.

గంజాయి తరలిస్తూ పట్టుబడిన వాహనాలు
గంజాయి తరలిస్తూ పట్టుబడిన వాహనాలు

హైదరాబాద్​ అడ్డాగా..

ganja transport from ap: ఏపీలోని పలు ప్రాంతాల నుంచి తెచ్చిన గంజాయిని హైదరాబాద్​లోని ఎల్బీనగర్​, మల్కాజిగిరి, కోంపల్లి, శేరిలింగంపల్లి, కూకట్​పల్లి తదితర ప్రాంతాల్లో నిల్వ ఉంచుతున్నారు. అందుకోసం స్థానికంగా కొందరి ఏజెంట్ల సాయంతో పక్కాగా ఏర్పాట్లు చేసుకుంటారు. ఇక్కడి నుంచి వాహనాలను మార్చి కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రకు తరలిస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా వివిధ రకాలుగా బోర్డర్​ దాటిస్తారు. కూరగాయలు, పండ్లు, పాలు, ఎరువులు తరలించే వాహనాలు.. ఇలా ఏ అవకాశాన్ని వదులుకోకుండా సరుకుని గమ్యస్థానానికి చేర్చుతున్నారు.

ganja smuggling
ganja smuggling

పక్కా ప్రణాళికతో..

గంజాయిని తలించడంలో స్మగ్లర్లు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తారు. కళ్లున్నోడు ముందు మాత్రమే చూస్తాడు.. కానీ గంజాయి తరలించే వారు ఒళ్లంతో కళ్ల చేసుకుని వెళ్తుంటారు. పెద్ద మొత్తంలో గంజాయిని సాధారంగా లారీలలో రవాణా చేస్తుంటారు. ఆ లారీకి ఎస్కార్టుగా ముందు ఓ కారులో కొందరు వెళ్తారు. కారులో ఉన్న వ్యక్తులు రెక్కీ నిర్వహిస్తూ.. ఎప్పటికప్పుడు లారీలో ఉన్నవారిని అలర్ట్​ చేస్తూ ఉంటారు. లారీ కారు మధ్య కనీసం ఐదు కిలోమీటర్ల దూరం ఉండేలా చూసుకుంటారు. టోల్​గేట్లు, చెక్​పోస్టులు, పోలీసుల తనిఖీలు ఇలా ప్రతి విషయాన్ని లారీలో ఉన్న వారికి చేరవేస్తుంటారు. కారులో వెళ్తున్న వారి నుంచి సమాచారం రాకున్నా.. వారి ఫోన్​ స్విచ్చాఫ్​ వచ్చినా.. ప్రమాదం ఉందని స్మగ్లర్ల సిగ్నల్స్​... ఈ విషయాలు ఇటీవల పట్టుబడిన ఓ ముఠాను విచారించగా బయటపడ్డాయి.

పెద్ద మొత్తంలో గంజాయి సీజ్​ చేసిన రాజకొండ పోలీసులు

తొలిసారి ఇలా చిక్కారు

ganja crop in ap : ఏవోబీ, విశాఖ మన్యం నుంచి గంజాయిని సేకరిస్తూ మహారాష్ట్రకు తరలిస్తున్న ఓ ముఠాను ఇటీవల రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 240 కిలోల గంజాయితో పాటు వాహనాలు, సెల్​ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తీసుకెళ్లేందుకు ముంబయికు చెందిన లాల్జీ బరన్​వాలా మొదటిసారిగా నగరానికి వచ్చాడు. అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు మాటు వేశారు. మొత్తం గ్యాంగ్​ అంతా కలిసి గంజాయిని తరలిస్తుండగా.. ఓ చోట వారందరిని పట్టుకున్నారు. వారి నుంచి 240 కిలోల గంజాయి, రూ.8లక్షల నగదు, రెండు కార్లు, లారీ, 19 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.90 లక్షలు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

ganja seized in Hyderabad : గంజాయి తరలిస్తున్న ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కేరళకు చెందిన శివన్‌కృష్ణన్, అంగది ఉపేందర్, సంతోష్‌లాల్జి బరన్‌వాల్, తేజాస్‌కుమార్, మహమూద్‌ సమీర్, హరీష్, సుమేష్, షేక్‌ జిలానీ, అడిగెల ప్రకాశ్‌లను అరెస్ట్‌ చేశారు. ఈ కేసు ద్వారా గంజాయి సరఫరా చేసే కీలకసూత్రదారి సుబ్బారావు వివరాలు తెలిశాయని సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. ఏవోబీలో గంజాయి కిలో రూ.8000 కొనుగోలు చేసి ముంబయిలో రూ.15,000లకు విక్రయించి లాభపడుతున్నారని పేర్కొన్నారు. కేసులో ఉపేంద్ర అనే వ్యక్తిపై రాజమండ్రి, ఖమ్మం పోలీస్‌స్టేషన్లలో పాత కేసులున్నట్టు చెప్పారు. వీరిపై పీడీయాక్ట్‌ ప్రయోగించనున్నట్టు తెలిపారు.

పోలీసుల పక్కా ప్లాన్​..

ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు మాదకద్రవ్యాల రవాణా ముఠాలపై నిఘా పెంచటంతో కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. మత్తు పదార్థాల రవాణా చేసే స్మగ్లర్ల ప్రణాళికను చిత్తు చేసేందుకు పోలీసులు వినూత్న మార్గాలను అనుసరిస్తూ స్మగ్లర్లకు షాక్​ ఇస్తున్నారు.

ఇవీ చూడండి: జోరెత్తుతున్న మత్తు విక్రయాలు- ఎన్​సీబీకి సిబ్బంది కరవు

Cp Anjani Kumar: 'మైనర్లకు మద్యం అమ్మితే కఠిన చర్యలు తప్పవు'

Cannabis Trafficking: మారిన పంథా... గంజాయి ముఠాల కొత్త ఎత్తుగడలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.