ప్రజా సమస్యలకు పరిష్కారం లభించే దేవాలయం లాంటి శాసనసభలో ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. 19 మంది శాసన సభ్యులున్న కాంగ్రెస్ సభ్యుల్లో కొందరిని కేసీఆర్ కోరుకున్నారని అన్నారు.
ఇప్పుడు ఉన్న సభ్యుల ప్రకారమే సమయం కేటాయిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ సభ్యలకు కేవలం ఆరు నిమిషాలు మాత్రమే మాట్లాడటానికి సమయం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చాలా దారుణమని అన్నారు.
ప్రజా సమస్యల పట్ల మాట్లాడే అవకాశం కాంగ్రెస్‌కు ఇవ్వడం లేదని ఎంఎల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ వద్ద మీడియా పాయింట్ తొలగించడం అప్రజాస్వామికం అని అన్నారు. దేశ చరిత్రలో ఇలాంటి ఘటనలు జరగలేదన్నారు. ప్రభుత్వం నియంతృత్వ ఆలోచనలను అమలు చేస్తోందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో రాచరిక పాలన నడుస్తోందని విమర్శించారు. స్పీకర్ మీడియా పాయింట్‌ను పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి : సత్తుపల్లి ఓపెన్‌కాస్ట్ గనిలో కాలుష్య ప్రభావంపై నిపుణుల కమిటీ