ఏపీ మాజీ శాసససభాపతి కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు ముందు, ఆయన చరవాణి నుంచి 12 కాల్స్ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. కోడెల ఫోన్ ఆచూకీ లేకపోవడంతో సాంకేతికతను ఉపయోగించి కాల్ లిస్టును సేకరించారు. ఈ నెల 16వ తేదీన ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్య పలువురితో కోడెల మాట్లాడినట్లు తేల్చారు. కాల్స్ అన్నీ ఒకట్రెండు నిమిషాల పాటే ఉన్నట్లు గుర్తించారు. చివరిగా అంగరక్షకుడు ఆదాబ్‌తో 9 సెకన్ల పాటు మాట్లాడినట్లు దర్యాప్తులో తేలింది. చనిపోయే ముందు 24 నిమిషాలపాటు కోడెల ఫోన్ మాట్లాడారన్న ప్రచారంలో వాస్తవం లేదని పోలీసులు చెబుతున్నారు. కోడెల ఆత్మహత్య కేసు దర్యాప్తులో భాగంగా,ఆయన కుమారుడు శివరామ్‌తో పాటు సమీప బంధువులను ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చనిపోయే ముందు కోడెల మాట్లాడిన వారందరినీ కూడా విచారించే అవకాశం ఉంది.
ఇవీ చూడండి.. అకిల ధనంజయ బౌలింగ్‌పై ఏడాది వేటు