ETV Bharat / state

గత నెల జీఎస్‌టీ రాబడులు ఎలా ఉన్నాయంటే? - జీఎస్‌టీ రాబడులు

ఫిబ్రవరి నెల జీఎస్టీ రాబడులను కేంద్రం వెల్లడించింది. ఫిబ్రవరి నెలలో రూ.1లక్ష 5వేల 366 కోట్ల మేర రాబడులు వచ్చినట్లు ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఫిబ్రవరి నెలలో మొత్తం 83 లక్షల మంది రిటర్న్​లు ఫైల్​ చేసినట్లు తెలిపింది.

how-about-february-months-gst-returns-in-india
గత నెల జీఎస్‌టీ రాబడులు ఎలా ఉన్నాయంటే?
author img

By

Published : Mar 2, 2020, 5:33 AM IST

ఫిబ్రవరి నెల జీఎస్టీ రాబడుల వివరాలను... కేంద్ర ఆర్థిక శాఖలోని రెవెన్యూ విభాగం వెల్లడించింది. ఫిబ్రవరి నెలలో 1 లక్ష 5 వేల 366 కోట్ల రూపాయల మేర.. జీఎస్టీ రాబడులు వచ్చినట్లు ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. కేంద్ర జీఎస్టీ కింద రూ. 20 వేల 569 కోట్లు.. ఎస్​జీఎస్టీ కింద రూ. 27 వేల 348 కోట్లు.. ఐజీఎస్టీ కింద రూ. 48 వేల 503 కోట్లు.. సెస్‌ కింద రూ. 8 వేల 947 కోట్లు రాబడులు వచ్చినట్లు వివరించింది.

ఫిబ్రవరి నెలలో 83 లక్షల మంది రిటర్న్‌లు ఫైల్‌ చేసినట్లు పేర్కొంది. 2019 ఫిబ్రవరి రాబడులతో పోలిస్తే.. 2020 ఫిబ్రవరిలో వచ్చిన రాబడులు 12శాతం వృద్ధి కనపరిచినట్లు వెల్లడించింది. అంతకు ముందు ఏడాది ఫిబ్రవరి నెలలో వచ్చిన రాబడులతో.. బేరీజు వేసుకుంటే రాష్ట్రంలో రాబడులు తగ్గాయి. తెలంగాణ రాష్ట్రంలో 2019 ఫిబ్రవరిలో రూ. 3 వేల 460 కోట్లు వచ్చిన రాబడులతో.. 2020 ఫిబ్రవరిలో వచ్చిన రూ. 3 వేల 667 కోట్లు రాబడులతో పోలిస్తే.. కేవలం 6 శాతం వృద్ధి రేటు సాధించినట్లు.. కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.

గత నెల జీఎస్‌టీ రాబడులు ఎలా ఉన్నాయంటే?

ఇదీ చూడండి: బంగాల్​పై భాజపా గురి- దీదీని దించేందుకు పక్కా స్కెచ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.