హైదరాబాద్ శివారులో మంగళవారం రాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. రాయదుర్గం బయోడైవర్సిటీ పార్కు వద్ద ఓ భవనం పైకప్పు కూలింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. ఆ భవనానికి కాంక్రీట్ వేస్తుండంగా అకస్మాత్తుగా ఇంటిపైకప్పు కూలింది.
సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న అధికారులు సహాయకచర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఆ భవనానికి అన్ని అనుమతులు ఉన్నాయా లేదా అని జీహెచ్ఎంసీ అధికారులు ఆరా తీస్తున్నారు.
ఇదీ చదవండి: ఆన్లైన్లో అందుకు ఆసక్తి చూపారో... ఇక అంతే సంగతి!