ETV Bharat / state

భారీ వర్షాలకు బొల్లారంలో కూలిన ఇల్లు

author img

By

Published : Oct 20, 2020, 8:51 AM IST

జంట నగరాల్లో ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఇళ్లు పేకమేడలా కూలిపోతున్నాయి. వరద నీరు పెద్దఎత్తున చేరడంతో శిధిలావస్థకు చేరుకున్న ఇళ్లు పూర్తిగా దెబ్బతింటున్నాయి. తాజాగా సికింద్రాబాద్​లోని బొల్లారంలో ఓ ఇంటి గోడ కూలి ముందు భాగం ధ్వంసమైంది.

House collapsed in bollaram secunderabad
భారీ వర్షాలకు బొల్లారంలో కూలిన ఇల్లు

భారీ వర్షాలకు సికింద్రాబాద్​లోని బొల్లారంలో ఓ ఇల్లు కూలిపోయింది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెద్ద ఎత్తున వరదనీరు చేరడంతో శివాలయం సమీపంలోని ఓ ఇంటిగోడ పూర్తిగా ధ్వంసమైంది.

సాయంత్రం ఒక్కసారిగా ఇంటి ముందుభాగం కూలిపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. కంటోన్మెంట్ అధికారులకు సమాచారమిచ్చినా వారు స్పందించలేదని బాధితులు వాపోయారు. ప్రస్తుతం ఉండేందుకు ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:వరద బాధితులకు ప్రభుత్వం అండ.. రూ.550 కోట్లు విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.