ETV Bharat / state

'హాస్టళ్లను చిన్న పరిశ్రమలుగా గుర్తించాలి... ప్రభుత్వమే ఆదుకోవాలి' - హాస్టళ్ల నిర్వాహకుల ఇబ్బందులు

లాక్​డౌన్ కారణంగా నష్టాల్లో ఉన్న తమను ప్రభుత్వం చేయూతనందించి... ఆర్థికంగా తోడ్పడాలని ప్రైవేట్ హాస్టళ్ల నిర్వాహకులు కోరుతున్నారు. చిన్న పరిశ్రమలుగా తమను గుర్తించి ఆదుకోవాలన్నారు.

hostel-maintenance-problems-in-lockdown-time
'హాస్టళ్లను చిన్న పరిశ్రమలుగా గుర్తించాలి... ప్రభుత్వమే ఆదుకోవాలి'
author img

By

Published : May 27, 2020, 8:18 PM IST

లాక్​డౌన్ కారణంగా హాస్టళ్లలోని విద్యార్థులంతా ఇళ్లకు వెళ్లిపోయారని... ఇలాంటి సమయంలో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని సాగర్ హైవే హాస్టల్స్​ అసోసియేషన్ అధ్యక్షుడు సతీష్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హస్తినాపురం డివిజన్ ఓంకార్ నగర్ కాలనీలో హాస్టల్స్ అసోసియేషన్ నాయకులు సమావేశమయ్యారు. వారి సమస్యలపై చర్చించారు.

2నెలలుగా లాక్​డౌన్​ తో హాస్టళ్లు మూతపడ్డాయి. విద్యార్థులు, ఉద్యోగులు ఇళ్లకు వెళ్లిపోయారు. రూపాయి ఆదాయం లేకపోగా... భవనం అద్దె, కరెంట్ బిల్లులు కట్టడమే గగనంగా మారిపోయిందని వాపోతున్నారు. ప్రభుత్వం తమను చిన్న పరిశ్రమలుగా గుర్తించి ఆదుకోవాలని పలువురు హాస్టల్ నిర్వాహకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

''లాక్​డౌన్ నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. ఇలాంటి సమయంలో భవనాల అద్దెలు చెల్లించలేకున్నాం. కాలేజీలు తిరిగి ప్రారంభమయ్యే వరకు భవన యజమానుల నుంచి అద్దె విషయంలో వెసులుబాటు కల్పించేలా ప్రభుత్వమే చొరవ తీసుకోవాలి. కరెంటు బిల్లులు, ట్రేడ్ లైసైన్స్ వంటి టాక్స్​లను మాఫీ చేయాలి.''

- సతీష్ రెడ్డి (సాగర్ హైవే హాస్టల్స్ అసోసియేషన్ అధ్యక్షులు)

''చదువుకున్న దానికి తగిన ఉద్యోగం చేయలేక... ఇంట్లో వారికి ఇబ్బంది లేకుండా ఉన్నంతలో హాస్టళ్లు నిర్వహిస్తున్నాం. ప్రైవేట్ హాస్టళ్లను చిన్న పరిశ్రమలుగా గుర్తించి రుణ సౌకర్యం కల్పించాలి.''

- జ్యోతి (సంయుక్త కార్యదర్శి సాగర్ హైవే హాస్టల్స్ అసోసియేషన్)

ఆర్థిక ఇబ్బందుల కారణంగా తామంతా రోడ్లమీదకు వచ్చారని హాస్టల్స్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కష్టకాలంలో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.