ETV Bharat / state

రోడ్డుపై పరుగులు పెట్టిస్తున్న ఆకలి - run for food in Hyderabad

లాక్‌డౌన్‌ ప్రభావంతో రహదారుల వెంట ఉండే నిరాశ్రయులు ఆకలితో అలమటిస్తున్నారు. రోజూ దాతల సాయంతోనే వీరు పొట్ట నింపుకొంటున్నారు. హైదరాబాద్​ బస్​ భవన్​ సమీపంలో అన్నదానం చేసే వాహనం రాగానే ఆహార పొట్లాల కోసం పరుగులు తీశారు.

Breaking News
author img

By

Published : Apr 30, 2020, 3:46 PM IST

లాక్‌డౌన్‌తో నెల రోజులుగా పని లేదు. పైసా ఆదాయం లేదు. అప్పు పుట్టే పరిస్థితి లేదు. కొన్ని వర్గాలకు లాక్‌డౌన్‌ అంత ఇబ్బందికరం కానప్పటికీ.. దినసరి కూలీలు, నిరుపేదలకు పూటగడవడమే కష్టమైయింది. రెక్కాడితే కానీ... డొక్కాడని వర్గాలకు నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. ఈ క్రమంలోనే పేదలు దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. నిత్యావసరాలు, భోజనం ఏది ఇస్తోన్నా.. వద్దనకుండా తీసుకుంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.