తెరాస ప్రభుత్వం హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్ది... అన్ని రంగాల్లో అభివృద్ధి పరుగులు పెట్టిస్తుందని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. రాష్ట్రంలో త్వరలోనే ఉద్యోగుల సమస్యలతో పాటు... ఖాళీల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని హోంమంత్రి తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాసకు మద్దతు కోరుతూ... హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్‌లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఉదయపు నడకకు వచ్చిన వారితో మాట్లాడిన ఆయన... తెరాస సర్కార్ చేపట్టిన అభివృద్ధి, ఎమ్మెల్సీ అభ్యర్థి గురించి వివరించారు. రెండు స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించి... ప్రభుత్వానికి మద్దతునివ్వాలని హోంమంత్రి కోరారు.
- ఇదీ చూడండి: ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలు