జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం నేటితో పూర్తి కానున్న నేపథ్యంలో నేతలు ప్రచారం ముమ్మరం చేశారు. కార్వాన్ అభ్యర్థి ముత్యాల భాస్కర్, మిత్ర కృష్ణలకు మద్దతుగా రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. డివిజన్ మొత్తం పర్యటించి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు.
ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాస 105 సీట్లు గెలుచుకుంటుందని మహమూద్ అలీ ఆశాభావం వ్యక్తం చేశారు. కేటీఆర్ లాంటి డైనమిక్ లీడర్ ఆధ్వర్యంలో కచ్చితంగా గెలుపు తమదే అని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి : 'బల్దియా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు'