ETV Bharat / state

పోలీసులు, పరిశ్రమలకు వారధిగా ఎస్సీఎస్సీ: హోం మంత్రి

author img

By

Published : Jan 29, 2021, 6:58 PM IST

Updated : Jan 29, 2021, 7:51 PM IST

పోలీసులు.... హైదరాబాద్‌ను శాంతిభద్రతలకు చిరునామాగా మార్చారని హెచ్​ఐసీసీలో జరిగిన 'సోసైటీ ఫర్‌ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్-ఎస్సీఎస్సీ' 15 వార్షికోత్సవంలో పాల్గొన్న అతిథులు కొనియాడారు. నేరాల కట్టడి, నియంత్రణలో తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని అభినందించారు. పోలీసులకు, పరిశ్రమలకు... ఎస్సీఎస్సీ వారధిగా మారిందని.. ఇప్పుడు ఔషధ, విద్యా, స్థిరాస్తి వ్యాపార సంస్థలకు విస్తరించడం శుభపరిణామమని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ కొనియాడారు.

home-minister-mahmood-ali-participated-in-scsc-15-anniversary-at-hicc-in-hyderabad
పోలీసులకు, పరిశ్రమలకు వారధిగా ఎస్సీఎస్సీ: హోం మంత్రి
పోలీసులు, పరిశ్రమలకు వారధిగా ఎస్సీఎస్సీ: హోం మంత్రి

హైదరాబాద్‌ హెచ్​ఐసీసీలో 'సోసైటీ ఫర్‌ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్-ఎస్సీఎస్సీ' 15 వార్షికోత్సవం ఘనంగా జరిగింది. హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ డీజీపీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్‌, రాచకొండ సీపీలు, ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్ల సహా ఐటీ కంపెనీల ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు. నేరాల కట్టడి, నియంత్రణలో తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని అతిథులు అభినందించారు.

సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్... పోలీసులకు, పరిశ్రమలకు వారధిగా నిలుస్తోందని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. 15ఏళ్ల ప్రస్థానంలో ఎస్సీఎస్సీ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిందన్నారు. ఐటీ కారిడార్‌లో భద్రతే లక్ష్యంగా ఏర్పడిన సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్... క్రమంగా సేవా కార్యక్రమలకు విస్తరించిందని మహేందర్ రెడ్డి తెలిపారు. సైబర్‌ భద్రతే లక్ష్యంగా త్వరలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేయబోతున్నామని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ వెల్లడించారు.

షీషటిల్స్‌, కమాండబుల్స్‌, మార్గదర్శక్‌, సంఘమిత్ర, ట్రాఫిక్‌ వలంటీర్స్‌ వంటి విభాగాలను సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌనిల్స్‌ ప్రవేశపెట్టింది. పౌరుల జీవితాన్ని మెరుగుపర్చడంలో ఈ విభాగాలు కీలక ప్రభావం చూపాయి.

-మహమూద్ అలీ, హోంమంత్రి

తెలంగాణ పోలీసు వ్యవస్థలో సాంకేతికను ప్రవేశపెట్టేముందు.... మా బృందం లండన్‌ మెట్రోపాలిటన్‌, న్యూయార్క్‌ సిటీ, వాషింగ్టన్‌ డీసీ పోలీసు వ్యవస్థల్ని పరిశీలించింది. అక్కడ ఎలాంటి సాంకేతిక వాడుతున్నారో పరిశీలించాం. రాష్ట్రానికి తిరిగివచ్చి ఎలా అమలు చేయాలనే విషయంపై దృష్టిసారించాం. ప్రపంచ పోలీసు వ్యవస్థలోనే సాంకేతిక వినియోగంలో.. కొన్ని కేసులో సమానంగా, మరికొన్ని కేసుల్లో మెరుగ్గా తెలంగాణ పోలీసులు ఉన్నారనే విషయాన్ని నేను గర్వంగా చెబుతున్నాను.

-మహేందర్‌రెడ్డి, డీజీపీ

రహదారి, మహిళ భద్రతకు తీసుకోవాల్సిన చర్యల్లో స్థిరత్వం సాధించాం. సైబర్‌ భద్రతనే మా తదపరి సవాల్. ప్రస్తుతం ఆ దిశలో ఇప్పటికే అడుగులు వేస్తున్నాం. డీపీజీ మహేందర్‌రెడ్డి ఎప్పుడూ సైబర్‌ భద్రత అంశాలపై మాతో చర్చిస్తుంటారు. ఐటీ పరిశ్రమ సాయంతో.. సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌.. త్వరలోనే సైబర్‌ సెక్యూరిటీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను మా కమిషనరేట్‌ పరిధిలో ఏర్పాటు చేయబోతోంది. ఇప్పటికే ప్రణాళిక ప్రారంభమైంది. ఇదే భవిష్యత్తు లక్ష్యం.

-సజ్జనార్‌, సైబరాబాద్‌ సీపీ

లాక్‌డౌన్‌లో పోలీసులు అందించిన సేవలు స్ఫూర్తిదాయకంగా నిలిచాయని ప్రముఖ పారిశ్రామివేత్త బీవీఆర్‌ మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌ను మహిళలకు అత్యంత సురక్షితంగా మార్చడంలో పోలీసులదని కీలక పాత్రని భారత్‌ బయోటెక్‌ జేఎండీ సుచిత్ర ఎల్లా తెలిపారు. ఈనెల 13న కొవాగ్జిన్‌ను జీనోమ్‌ వ్యాలీ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్తున్నప్పుడు పోలీసులు చేపట్టిన బందోబస్తు, తీసుకున్న జాగ్రత్తలు... రోమాలు నిక్కపొడుచుకునేలా చేశాయని హర్షం వ్యక్తం చేశారు.

లాక్‌డౌన్‌ సయమంలో 6.5 మిలియన్ల ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేశారు. ఈ విజయంలో తెలంగాణ పోలీసుల అందించిన సహాయసహకారాలు మాకు ఎంతో దోహదం చేశాయి. లాక్‌డౌన్‌లో వారెంతో కీలక పాత్ర పోషించారు. వారికి కరతాళధ్వనులతో కృతజ్ఞతలు.

-బీవీఆర్‌ మోహన్‌రెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త

జనవరి 13న కొవాగ్జిన్‌ను తొలిసారి షిప్పింగ్‌ చేసిన ఘనతలో... మా వెంటే నిలిచిన తెలంగాణ పోలీసుల మద్దతు ఎంతో కీలకం. ఆ రోజున నాకు రోమాలు నిక్కపొడుచుకున్న అనుభూతి కలిగింది. దూరదృశ్యమాధ్యమంలో షిప్పింగ్‌ ప్రక్రియ చూస్తున్న నా కళ్లలో నీళ్లు తిరిగాయి. కొవాగ్జిన్‌ కోల్డ్‌ ట్రక్కులకు తెలంగాణ పోలీసులు విమానాశ్రయం వరకూ ఎస్కార్ట్‌గా వెళ్లారు. అదో గొప్ప సంఘటన. నాకు మాత్రమే కాదు మొత్తం భారత్‌ బయోటెక్‌ బృందానికి కూడా.

-సుచిత్ర ఎల్లా, భారత్‌ బయోటెక్‌ జేఎండీ

పురస్కారాల ప్రదానం...

వివిధ విభాగాల్లో తోడ్పాటునందించిన సంస్థల ప్రతినిధులకు ఎస్సీఎస్సీ ఆధ్వర్యంలో పురస్కారాలు ప్రదానం చేశారు. సైబరాబాద్ సెక్యూరిటి కౌన్సిల్ అభివృద్ధికి కృషి చేసిన మాజీ చైర్మన్లు, ప్రధాన కార్యదర్శులను హోంమంత్రి మహమూద్ అలీ సన్మానించారు.

ఇదీ చదవండి: పన్నెండు రోజుల్లో పెళ్లి.. తండ్రీ కొడుకులే మిగిలారు.!

Last Updated : Jan 29, 2021, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.