ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రంజాన్ ప్రార్థనలు చేయాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ సూచించారు. రంజాన్ సందర్భగా ఇండ్లలోనే ప్రార్థనలు చేసుకోవడానికి ప్రాముఖ్యత ఇవ్వాలని తెలిపారు. ఒక్కో మసీదులో కేవలం నలుగురు మాత్రమే ప్రార్థనలు చేయాలని హోంమంత్రి అన్నారు. ఈద్-ఉల్-ఫితర్ నమాజ్ , జుమ్మా నమాజ్లలో నలుగురు మాత్రమే మసీదుల్లో ప్రార్థనలు చేయాలని పేర్కొన్నారు. మసీదు చిన్నదైనా, పెద్దదైనా నలుగురి కన్నా ఎక్కువ మంది ఉండరాదని స్పష్టం చేశారు.
ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితులను , లాక్డౌన్ మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ సూచనలను పాటించాలన్నారు. మిగతా వారు ఇళ్లలో ప్రార్థనలను చేసుకోవాలన్నారు. ఈ సారి కరోనా మహమ్మారి చాలా వేగంగా వ్యాపిస్తోందని, దీనివల్ల అజాగ్రత్త వహిస్తే ఇబ్బందులు పడతారన్నారు. ముస్లింలు పెద్ద సంఖ్యలో మసీదులలో గుమిగూడడం మానేయాలన్నారు.
ఇదీ చదవండి: 'ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పరిస్థితులు మెరుగు'