ETV Bharat / state

నిందితులు ఎవరైనా కఠిన చర్యలు తప్పవు: హోం మంత్రి మహమూద్​ అలీ - ts news

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ సామూహిక అత్యాచార ఘటనలో నిందితులు ఎవరైనా కఠిన చర్యలు తప్పవని హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ స్పష్టం చేశారు. పోలీసులపై ఎలాంటి ఒత్తిడి లేదని స్వతంత్రంగా దర్యాప్తు జరుగుతోందన్నారు.

నిందితులు ఎవరైనా కఠిన చర్యలు తప్పవు: హోం మంత్రి మహమూద్​ అలీ

author img

By

Published : Jun 4, 2022, 2:53 PM IST

హైదరాబాద్ జూబ్లీహిల్స్​లో జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ స్పందించారు. ఈ సంఘటన జరగడం బాధాకరం అన్నారు. నిందితులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకుంటామని.. ఈ కేసులో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు తీసుకుంటారన్నారు. తెలంగాణ పోలీసులపై ఎలాంటి ఒత్తిడి లేదని... స్వతంత్రంగా దర్యాప్తు జరుగుతోందన్నారు. హైదరాబాద్ హజ్ హౌస్​లో జరిగిన హజ్ యాత్రికుల వాక్సినేషన్ కార్యక్రమంలో హోమ్ మంత్రి మహమూద్ అలీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

"జూబ్లీహిల్స్‌ అత్యాచార ఘటనలో ఎవరినీ వదలం. నిందితులు ఎవరైనా చర్యలు తప్పవు. మా కుటుంబ సభ్యులపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు." -మహమూద్​ అలీ, హోంమంత్రి

నిందితులు ఎవరైనా కఠిన చర్యలు తప్పవు: హోం మంత్రి మహమూద్​ అలీ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.