Home Guard Ravinder Death : జీతం ఇవ్వకుండా అధికారులు వేధిస్తున్నారంటూ ఈ నెల 5న ఆత్మహత్యాయత్నం చేసుకున్న హోంగార్డు రవీందర్ చికిత్స పొందుతూ (Home Guard Ravinder Death) మృతి చెందాడు. అపోలో డీఆర్డీఓ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న బాధితుడు ఉదయం 6గంటల సమయంలో మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో పోలీసులు రవీందర్ మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.
Wife Sandhya Reaction to Ravinder Death : మరోవైపు పోలీసు ఇంక్వెస్ట్ రిపోర్టుపై సంతకం పెట్టడానికి.. రవీందర్ భార్య సంధ్య నిరాకరించింది. ఉస్మానియా ఆసుపత్రి ఓపీ బ్లాక్ ఎదురుగా నిరసనకు దిగింది. తమ కుటుంబానికి న్యాయం జరగాలని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మృతుడి ఇద్దరు కుమారులు, తల్లిదండ్రులు, బంధువులు.. సంధ్యతో పాటు నిరసన చేపట్టారు. గోషామహల్ కమాండెంట్ కార్యాలయం ఆవరణలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలను బయటపెట్టాలని సంధ్య (Sandhya Reaction to Ravinder Death) డిమాండ్ చేశారు.
Revanth On Home Guard Ravinder Death : 'హోంగార్డు రవీందర్‌ది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వం చేసిన హత్యే'
జీతం గురించి అడగానికి వెళితే కమాండెంట్ కార్యాలయంలో పనిచేసే ఏఎస్‌ఐ నర్సింగ్ రావు, కానిస్టేబుల్ చందు దుషించారని.. సంధ్య ఆరోపించింది. అంతేకాకుండా కించపర్చేలా మాట్లాడిన విషయాన్ని తన భర్త.. తనకు ఫోన్ చేసి చెప్పాడని.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదని ఆమె వాపోయింది. సాయంత్రం పెట్రోల్ పోసుకొని రవీందర్ నిప్పంటించుకున్నట్లు పోలీసులు ఫోన్ చేసి చెప్పారని.. తన భర్త ఆత్మహత్యాయత్నం చేసుకునేంత పిరికివాడు కాదని పేర్కొంది. అక్కడ ఉన్న పోలీసులే పెట్రోల్ పోసి నిప్పంటించి ఉండొచ్చని సంధ్య ఆరోపించింది.
Revanth On Home Guard Ravinder Death : ఉస్మానియా ఆసుపత్రి ఆవరణలో నిరసన చేపట్టిన సంధ్యకు.. పలు రాజకీయ పార్టీల నేతలు మద్దతు తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆసుపత్రి వద్దకు చేరుకొని సంధ్యను, కుటుంబసభ్యులను పరామర్శించారు. రవీందర్ ఘటన గురించి డీజీపీతో మాట్లాడానని ఆయన.. సంధ్యతో తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక హోంగార్డులను పర్మినెంట్ చేస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.
Kunamneni Sambasiva Rao On Home Guard Deah : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, చాడ వెంకట్‌రెడ్డి.. సంధ్యను పరామర్శించారు. రవీందర్ మృతి ప్రభుత్వ హత్యేనని కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ రూ.20,000 చెక్కును సంధ్యకు అందించారు. బీజేపీ నాయకులు జితేందర్.. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ క్రమంలోనే పోలీస్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తామని డీసీపీ సునీల్‌దత్ హమీ ఇవ్వడంతో.. సంధ్య ఆందోళన విరమించారు. తనకు ఉద్యోగం ఇప్పిస్తామని డీసీపీ ఇచ్చిన హామీ మేరకు.. ధర్నా విరమిస్తున్నట్లు ఆమె తెలిపారు. దాదాపు 8 గంటల పాటు ఆందోళన చేపట్టిన బాధితుడి కుటుంబ సభ్యులు పోస్టుమార్టం చేయడానికి అంగీకరించారు. దీంతో వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేయడంతో.. రవీందర్ మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. రేపు రవీందర్ అంత్యక్రియలు జరగనున్నాయి. మరోవైపు ఉస్మానియా ఆసుపత్రి వద్ద ముందస్తు జాగ్రత్తగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. డీసీపీలు సునీల్, హెగ్డె బందోబస్తును పర్యవేక్షించారు.
Hyderabad Home Guard Suicide Update : జీతం రాలేదని ఆత్మహత్యకు పాల్పడిన హోంగార్డు.. పరిస్థితి విషమం
Home Guard Ravinder Passed Away : ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హోంగార్డు రవీందర్ మృతి