ETV Bharat / state

టీఎస్ఆర్టీసీ కార్గో మరో అడుగు... ఇంటి వద్దకే మామిడి పండ్లు

TS RTC Cargo Services: మేడారం వనదేవతల మొక్కుల బంగారాన్ని భక్తుల నుంచి సేకరించి అమ్మవార్లకు టీఎస్ఆర్టీసీ సమర్పించింది. ఆ తర్వాత భద్రాద్రి సీతారాముల తలంబ్రాలను భక్తులకు చేర్చింది. తాజాగా కార్గో, పార్శిల్ సేవల విభాగం సహజ సిద్ధంగా పండించే జగిత్యాల బంగినపల్లి మామిడి పండ్లను డోర్ డెలివరీ ద్వారా అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

tsrtc
టీఎస్ఆర్టీసీ
author img

By

Published : May 3, 2022, 10:57 PM IST

TS RTC Cargo Services: మామిడి పండ్లు అంటే ఎవరికైనా నోరూరుతుంది. మార్కెట్ లో లభించే మామిడి పండ్లు రసాయనాలతో పండిస్తారనే అనుమానం ప్రజల్లో ఉంటుంది. కానీ నేరుగా మీరు మెచ్చే బంగినపల్లి మామిడి పండ్లను మీ ఇంటి వద్దకే టీఎస్ఆర్టీసీ తీసుకువస్తోంది.

మామిడి పళ్లు కావాలనుకునే వారు http://www.tsrtcparcel.in వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. 5 కిలోల నుంచి 10 టన్నుల వరకు బల్క్ బుకింగ్ చేసుకోనే సదుపాయం ఉందన్నారు. కిలో బంగినపల్లి మామిడి పండ్ల ధర రూ.115 ప్రకారం.. బుక్ చేసిన వారం రోజుల్లోనే కార్గో సేవల ద్వారా వినియోగదారుల ఇంటికి చేర్చడం జరుగుతుందని వివరించారు. మరిన్ని వివరాలకు సంస్థ కాల్ సెంటర్ నెంబర్​ 040-23450033 , 040-69440000 సంప్రదించవచ్చని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 'త్వరలో పాదయాత్ర చేపడతా.. దమ్ముంటే ఆపండి'

పారిశుద్ధ్య కార్మికుల కోసం చెన్నై ఐఐటీ విద్యార్థుల వినూత్న రోబో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.