ETV Bharat / state

Food distribution: కరోనా బాధితులకు ఉచితంగా ఆహారం పంపిణీ

హైదరాబాద్​ తిరుమలగిరిలోని హోలీ మేరీ చర్చ్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు నగరంలోని నిరుపేద కరోనా బాధితులకు ఉచితంగా ఆహారాన్ని అందిస్తున్నారు.

Holy Mary Church Administrator distributed food to corona victims
కరోనా బాధితులకు ఉచితంగా ఆహారం పంపిణీ
author img

By

Published : May 30, 2021, 5:08 PM IST

హైదరాబాద్ తిరుమలగిరిలోని హోలీ మేరీ చర్చ్ నిర్వాహకుడు మైఖేల్.. నగరంలోని కరోనా బాధితులకు ఉచితంగా భోజనం పంపిణీ చేస్తున్నారు. నేరుగా బాధితుల ఇళ్ల వద్దకే వెళ్లి భోజనాన్ని అందిస్తూ... వారిలో ధైర్యాన్ని నింపుతున్నారు. ఇదే కాకుండా కరోనా బారిన పడిన పేద ప్రజలకు బెర్నార్డ్ అనే వ్యక్తి.. ఆర్థిక సాయాన్ని అందజేశారు. ప్రస్తుత విపత్కర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు.

కరోనా కారణంగా ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలను ఆదుకోవాలనే ఉద్దేశంతో గత పది రోజులుగా ఆహార పొట్లాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. 14 మంది సభ్యులు కలిసి ఓ బృందంగా ఏర్పడి భోజనం అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత ప్రమాదకర స్థితిలో ప్రతి ఒక్కరూ విధిగా కరోనా నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు.

ఇదీ చదవండి : Eatala: ఒక్క ఎకరం ఎక్కువ ఉన్నా ముక్కు నేలకు రాస్తా: ఈటల సతీమణి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.