ETV Bharat / state

ఫౌండేషన్ స్థాపించి.. లాక్ డౌన్ వేళ అండగా నిలిచి - హైదరాబాద్ కరోనా వార్తలు

లాక్​డౌన్ వల్ల ఉపాధి కరువై ఇబ్బందుల్లో ఉన్న కార్మికులను ఓ స్వచ్ఛంద సంస్థ ఆదుకుంటుంది. బీటెక్ చదువుతున్న సమయంలోనే 70 మంది విద్యార్థులు హెచ్​హెచ్​ఎన్ పౌండేషన్​గా ఏర్పడి.. గతేడాది నుంచి సేవలు అందిస్తున్నారు. తమ వంతు సామాజిక బాధ్యతగా.. అనేక రకాలుగా సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

Hnn foundation distributions daily needs

author img

By

Published : Jun 3, 2021, 12:18 PM IST

ఒకవైపు కరోనా మహమ్మారి, మరోవైపు లాక్ డౌన్​తో ఉపాధి కరువై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రోజువారి కార్మికులకు విద్యార్థుల బృందం నిత్యవసర సరుకుల పంపిణీకి శ్రీకారం చుట్టింది. బీటెక్ చదువుతున్న సమయంలో 70 మంది విద్యార్థులు హెచ్​ఎన్ఎన్ ఫౌండేషన్​గా (HNN Foundation) ఏర్పడి గతేడాది నుంచి కరోనా బాధితులకు, ఉపాధి కరవైన కార్మికులకు తమకు తోచిన సహాయాన్ని అందిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

గతేడాది నుంచి..

ఈ ఫౌండేషన్ సభ్యులు గతేడాది నుంచి నిత్యవసర సరుకులు, చలితో బాధపడుతూ రోడ్లపై నిద్రించేవారికి దుప్పట్ల పంపిణీ, అభాగ్యులకు అన్నదానం, కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం లాక్​డౌన్ విధించడంతో రోజువారి కార్మికుల జీవనం దుర్భరంగా మారిందని గ్రహించి నిత్యవసర సరుకుల పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు ఫౌండేషన్ అధ్యక్షుడు సాయి వికాస్ తెలిపారు. ఆన్​లైన్​లో విద్యనభ్యసించే నిరుపేద విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు, అవసరమైన విద్యార్థులకు లాప్​టాప్​లను కూడా పంపిణీ చేశామని వివరించారు.

హైదరాబాద్ కవాడిగూడలో ఈ ఫౌండేషన్ దాదాపు 200 మంది రోజువారి కార్మికులకు 7 రకాల నిత్యావసర సరుకుల పంపిణీ చేసింది. విద్యార్థి దశ నుంచే సమాజ సేవ చేయడం తమకు ఎంతో సంతృప్తికరంగా ఉందని ఫౌండేషన్ ప్రతినిధి భవ్య తెలిపారు. విద్యార్థులకు సమైక్యంగా నిర్మాణాత్మక కార్యక్రమం చేసే సత్తా ఉందని పేర్కొన్నారు.

ఇదీ చుడండి: Eatala : హైదరాబాద్​ చేరుకున్న ఈటల.. స్వాగతం పలికిన అనుచరులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.